BigTV English

Google Removed Indian Apps : భారత్‌ ట్రెండింగ్ యాప్స్‌కు షాక్.. ప్లేస్టోర్ నుంచి తొలగింపు

Google Removed Indian Apps : భారత్‌ ట్రెండింగ్ యాప్స్‌కు షాక్.. ప్లేస్టోర్ నుంచి తొలగింపు

Indian Apps


Google Removed Indian Apps : దేశంలోని పది పాపులర్ యాప్‌ల‌కు గూగుల్ గట్టి షాక్ ఇచ్చింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆ యాప్‌లను తొలిగించింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించడం లేదని వెల్లడించింది. దేశంలో రెండు లక్షలకు మందికి పైగా యాప్ డెవలపర్‌లు ప్లేస్టోర్ బిల్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారని తెలిపింది. అయితే ఈ పది యాప్‌లు తమ సర్వీసుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు ఇంకా నగదు చెల్లించలేదని గూగుల్ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది.

గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన యాప్స్


  • భారత్ మ్యాట్రిమోనీ
  • 99 ఎకర్స్
  • నౌకరీ
  • షాదీ. కామ్
  • ట్రూలీ మ్యాడ్లీ
  • కుకు ఎఫ్ఎం
  • క్వాక్ క్వాక్వాక్
  • స్టేజ్
  • ఆల్ట్ బై బాలాజీ టెలీఫిల్మ్స్
  • ఇన్ఫో‌ఎడ్జ్

గూగుల్ తీసుకున్న నిర్ణయంపై ఇన్ఫో‌ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్ చందానీ మాట్లాడుతూ.. భారత్ ప్రత్యేకమైన ప్లేస్టోర్‌నుఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్ మార్కెట్ పై ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్ ప్లే స్టోర్‌కు పోటీగా డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా మొబైల్ అప్లికేషన్ స్టోర్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

Read More : వాట్సాప్​ ‘సెర్చ్​ బై డేట్’ ఫీచర్​.. ఎలా వాడాలంటే?

ఈ చర్య తర్వాత కుకు ఎఫ్ఎం సీఈవో లాల్ చంద్ బిసు గూగుల్‌ని విమర్శిస్తూ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. “గూగుల్ వ్యాపారం విషయంలో పరమ చెత్త కంపెనీ. వారు భారతీయ స్టార్టప్ సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తున్నారు. 2019లో25 రోజుల పాటు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ప్లేస్టోర్‌లో యాప్ లేకుండా మా టీమ్ ప్రతిరోజూ ఆఫీసులో పని చేసేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించండి.” అని చెప్పుకొచ్చారు.

షాదీ.కామ్ ఫౌండర్ అనుపమ్ మిట్టల్ కూడా ఎక్స్‌లో స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు.. “ఈ రోజు భారతీయ ఇంటర్నెట్ చరిత్రలో చీకటి రోజు. గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి అనేక పెద్ద యాప్‌లను తొలగించింది.” అని అన్నారు.

ప్లే స్టోర్ నుంచి యాప్‌లను గూగుల్ ఎందుకు తొలగిస్తారు..

ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం సర్వీస్ ఫీజు వసూల్ చేస్తుంది. దీనిపై దేశ స్టార్టప్‌ కంపెనీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్-యాప్ చెల్లింపులపై 11-26 శాతం వసూలు చేసే వ్యవస్థను తొలగించాలని మన దేశానికి సంబంధిత అధికారులు కొందరు గతంలో గూగుల్‌ను కోరారు. ఈ వ్యవహారంపై గూగుల్ కోర్టును ఆశ్రయించింది.

కానీ ఈ ఘటన కారణంగా ఆ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించలేదు. దేశీయ యాప్ డెవలప్పర్లు గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని సవాలు చేస్తూ గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 2024 ఫిబ్రవరి 9నన జరిగిన విచారణలో ఈ యాప్‌లను ప్లే స్టోర్‌లో సేవ్ చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఈ కోర్టు తీర్పుల తర్వాత గూగుల్ ఫీజు వసూలు చేయడానికి లేదా యాప్స్‌ను తొలగించడానికి అనుమతి పొందింది.

Tags

Related News

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

SmartPhone Comparison: వివో V60e vs రియల్‌మీ 15 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ 5.. ₹30,000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Tesla Pi Phone: ఇండియాలోకి టెస్లా ఫోన్ .. ధరలు తెలిస్తే షాక్ అవుతారు!

Fake Sora Apps: ఆపిల్ యాప్ స్టోర్‌లో నకిలీ సోరా యాప్స్.. దోపిడికి గురైన లక్షల మంది యూజర్లు

Honda Gold Wing 2025: హోండా గోల్డ్ వింగ్ 2025.. లగ్జరీతో పవర్‌ను కలిపిన అమెరికన్ టూరింగ్ బైక్!

Instagram Reels Translation: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్.. రీల్స్ ఇకపై మీకు నచ్చిన భాషలో

Samsung M17 5G: శాంసంగ్ గెలాక్సీ M17 5G లాంచ్.. కేవలం రూ.11999కే అద్భుత ఫీచర్లు

Big Stories

×