E-Paper

విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారం.. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కామెంట్స్, రెండింటిని కంటిన్యూ

విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారం.. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కామెంట్స్, రెండింటిని కంటిన్యూ

Visakha: జులైలో భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు కార్యాలపాలు మొదలుకానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చేతుల ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖ సిటీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ ఎయిర్‌పోర్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురంతోపాటు విశాఖ ఎయిర్ పోర్టును కొనసాగించాలని డిమాండ్ చేశారు.

విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్లాన్ చేస్తోందని, ఇలాంటి సమయంలో విశాఖకు ఎయిర్‌పోర్టు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. పెట్టుబడుదారులు విశాఖకు వస్తున్నప్పుడు ఎయిర్‌పోర్టు లేకుంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరు ఫ్యూయల్ సేవ్ చేయాలని చెబుతున్నారని, నెలకు 2.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని వివరించారు. భోగాపురం ప్రయాణం చేస్తే ఫ్యూయల్ కారణంగా రూ. 75 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందన్నారు. సామాన్యుల మనోభావాల్ని తాము అడుగుతున్నామని మనసులోని మాట బయటపెట్టారు.

రెండు ఎయిర్‌పోర్టులు కంటిన్యూ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

డొమెస్టిక్ విమానాలను విశాఖ నుంచి కంటిన్యూ చేయాలని, ఇంటర్నేషనల్ భోగాపురం నుంచి నడపాలని డిమాండ్ చేశారు. చార్టెడ్ ఫ్లయిట్లలో వచ్చే వీఐపీలను భోగాపురంలో దిగి నగరానికి రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. జీఎంఆర్ సంస్థకు రావాల్సిన ఛార్జీలను విశాఖ ఎయిర్‌పోర్టులో కలెక్ట్ చేసుకోవాలన్నారు.

ఈ విషయంలో మేము చె ల్లించేందుకు సిద్ధమని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వనని నేరుగా చెబుతున్నారని, ఈ ప్రాంతంలో ప్రయాణికులు కావాలిగానీ ఉద్యోగాలు ఇవ్వరా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో జీఎంఆర్ సంస్థ ఆలోచించాలన్నారు.

ALSO READ: అమరావతి.. సారీ బ్రో-పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో షేర్ 

ఆ సంస్థకు భూమిని ఉచితంగా ఇచ్చారని, 10 సంవత్సరాల పాటు రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ఎవరూ మాట్లాడటం లేదని, ఒకవేళ గట్టిగా మాట్లాడితే సీటు పోతుందేమోనని భయం వారిని వెంటాడుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

4400 రోజుల పాలన అందించిన ప్రధానిమంత్రి నరేంద్రమోదీ ఇతర దేశాలలో మన ఖ్యాతి పెంచారని వివరించారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, కూటమి రెండేళ్ల పాలనపై ఈనెల 19న విశాఖలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపీకి హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రధాని ఇచ్చారని, మోడీ పాలనలో ఏపీకి అనేక ప్రాజెక్టు ఇచ్చారని తెలిపారు.

దురదృష్టవశాత్తు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేయలేదని, అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజలు మంచి ప్రభుత్వం కూటమికి పాలన అందించారని అన్నారు. రైల్వేజోన్ విషయంలో పొలిటికల్ కమిట్‌మెంట్ ఇచ్చారని, దీనిపై అపోహలు వద్దన్నారు. దీనిపై వచ్చే ఆదాయం అంతా కేంద్రానికే వెళ్తుందన్నారు.

Related News

Amaravati: అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల

సోదరుల మధ్య మళ్లీ చర్చ.. కేశినేని నానిపై చిన్ని రుసరుసలు, తెరపైకి కొత్త విషయాలు, మళ్లీ ఏం జరిగింది?

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి

చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. డీప్‌ఫేక్ కాల్‌తో రూ. 80 వేలు స్వాహా!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.. 15 మంది అధికారులు సస్పెండ్!

కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్‌కు తమ్ముడు డిఫెన్స్‌లో పడతాడా?

వినాశనం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో మారిన ఏపీ రూపురేఖలు!

×