Google India: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో 29 లక్షల యాడ్ అకౌంట్ల ఖాతాలను సస్పెండ్ చేసింది. దీంతోపాటు 247 మిలియన్ల ప్రకటనలను కూడా తొలగించింది. ఇవన్నీ గూగుల్ ప్రకటన విధానాలను ఉల్లంఘించినట్లు గుర్తించి రిమూవ్ చేసింది. వీటిలో ఎక్కువగా నకిలీ, మోసపూరిత ప్రకటనలు ఉన్నట్లు తెలిపింది.
గూగుల్ ఏం చెప్పింది?
గూగుల్ తన తాజా Ads Safety Report 2024లో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది కంపెనీ ఇప్పటివరకు చేసిన భారీ యాడ్ క్లీనప్ చర్యలలో ఒకటని వెల్లడించింది. భారతదేశంలో ప్రత్యేకంగా ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం వెనుక ప్రధాన కారణం పెరుగుతున్న స్కామ్‌లు, ప్రత్యేకంగా AI ఆధారిత ప్రకటనలేనని చెప్పింది. ఈ ప్రకటనల్లో ప్రజాదరణ పొందిన సెలెబ్రిటీల ఫొటోలను, పేర్లను అనుకరించి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించేవి అధికంగా ఉన్నాయని గూగుల్ గుర్తించింది. ముఖ్యంగా “దీనిలో మీరు కూడా పెట్టుబడి పెడితే 2X లాభం వస్తుందనే స్కామ్ ప్రకటనలు ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ చర్యలు
భారతదేశంతో పాటు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 5.1 బిలియన్ ప్రకటనలను తొలగించింది. అలాగే, 9.1 బిలియన్ ప్రకటనలపై పరిమితులు విధించింది. 39 మిలియన్లకుపైగా ప్రకటనదారుల ఖాతాలను పూర్తిగా సస్పెండ్ చేసింది. ఇది గూగుల్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద యాడ్ క్లీన్ అప్ క్యాంపెయిన్.
Read Also: Realme Narzo 80 launch: అగ్గువ ధరకే 6000mAh బ్యాటరీ ..
ఎందుకు ఈ స్థాయి చర్యలు?
-ఇప్పటికే మార్కెట్‌లో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. వాటిలో ప్రధానమైనవి:
-AI ద్వారా సెలబ్రిటీ వేషధారణ స్కామ్‌లు
-నకిలీ ఫైనాన్స్ యాడ్స్
-అనధికారిక బెట్టింగ్ ప్రకటనలు
-తప్పుడు ఆరోగ్య ఉత్పత్తుల ప్రచారం
-ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీయడమే. దీంతో డేటా కూడా ప్రమాదంలో పడుతోందని గూగుల్ తెలిపింది.
టెక్నాలజీ అభివృద్ధి
సైన్ అప్ సమయంలో నకిలీ ఖాతాలను గుర్తించే అల్గోరిథమ్ సహా అనేక వ్యవస్థలను 2024లో మరింతగా అభివృద్ధి చేశామని గూగుల్ చెప్పింది. యాడ్ నిబంధనలను బలంగా అమలు చేయడం కోసం 100 మందికి పైగా నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు గూగుల్ ప్రకటనల భద్రతా విధానం కేవలం నిబంధనల అమలుకు మాత్రమే పరిమితంగా ఉండేది.
నిబంధనలను ఉల్లంఘించే ప్రకటనలు
కానీ ఇప్పుడు అది ప్రొయాక్టివ్‌గా మారింది. అంటే, ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించే ప్రకటనలు ప్రసారం కాకముందే అవి గుర్తించి నిలిపివేయవచ్చు.ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో మిలియన్ల మంది వినియోగదారులకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభవాన్ని కల్పిస్తోంది గూగుల్. దీంతో ఇకపై యూట్యూబ్, గూగుల్ సెర్చ్ లేదా ఏదైనా వెబ్‌సైట్‌లో మోసపూరిత ప్రకటనలు కనబడే అవకాశాలు తక్కువగా ఉంటుంది.
నిబంధనలు పాటించండి
-ప్రస్తుతం గూగుల్ ప్రకటనలు పెట్టాలంటే, దాని నిబంధనలు చదివి ఖచ్చితంగా అనుసరించడం తప్పనిసరి. ముఖ్యంగా:
-నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల ప్రచారం చేయకూడదు
-అనధికారిక బెట్టింగ్, గేమింగ్ యాడ్స్ ప్రమోట్ చేయోద్దు
-AI వాడినా నిజమైన సమాచారం ఆధారంగా వాడాలి
-ప్రజల్లో భయం కలిగించే పద్ధతిలో ప్రకటనలు పెట్టకూడదు
-ఈ నిబంధనలను గణనీయంగా ఉల్లంఘిస్తే, వారి ఖాతా సస్పెండ్ కావడం ఖాయం.
టెక్ మోసాలు
AI స్కామ్‌లు రోజురోజుకూ కొత్త రూపాల్లో వస్తున్నాయి. కొన్నింటిని చూస్తే నమ్మశక్యంగా అనిపించవు. ఒక సెలెబ్రిటీ ముఖాన్ని కాపీ చేసి, వీడియో రూపంలో “నేను దీనిలో పెట్టుబడి పెట్టాను, మీరూ పెట్టండి” అనేలా చేయగలిగే టెక్నాలజీ వచ్చేసింది. ఇలాంటి మోసాలను గుర్తించాలంటే, సాధారణ మనిషికి కష్టమే. అందుకే గూగుల్ తన AI వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తోంది.