BigTV English

Samson injury: సంజు శాంసన్‌కు గాయం.. ఐపీఎల్ 2025 నుంచి దూరం

Samson injury: సంజు శాంసన్‌కు గాయం.. ఐపీఎల్ 2025 నుంచి దూరం

Samson injury: బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ తోనే ఐపీఎల్ 2025 లో తొలి సూపర్ ఓవర్ నమోదయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఢిల్లీ నుండి ఒక బ్యాటర్ కూడా ఆఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. ఢిల్లీ తరఫున అభిషేక్ పోరెల్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.


 

ఇక మిగతా బ్యాటర్లు ఫ్రెజర్ 9, కేఎల్ రాహుల్ 38, అక్షర్ పటేల్ 34, స్టబ్స్ 34 పరుగులు చేశారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కూడా సరిగ్గా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్ అనివర్యమైంది. అయితే సూపర్ ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్.. నాలుగు బంతుల్లోనే చేదించింది. దీంతో ఈ టోర్నీలో ఐదవ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.


ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. రాజస్థాన్ తరపున ఓపెనర్ బ్యాటర్ గా అద్భుతాలు చేశాడు. తన బ్యాటింగ్ సమయంలో సంజు సిక్సర్లు, ఫోర్లు కూడా కొట్టాడు. అయితే మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. సంజు అవుట్ కాకుండానే పెవిలియన్ చేరాడు. రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో సంజు, యశశ్వి జైష్వాల్ మంచి శుభారంభం అందించారు.

ఈ ఇద్దరు కలిసి రాజస్థాన్ స్కోరును 5 ఓవర్లలో 50కి తీసుకువెళ్లారు. అయితే 5.3 ఓవర్ లో సంజు జట్టును విడాలని నిర్ణయించుకున్నాడు. దీనికి కొద్ది బంతుల ముందు శాంసన్ బ్యాక్ పుట్ నుండి లాంగ్ సిక్స్ కొట్టాడు. ఆ సమయంలో అతడికి పక్కటెముకల్లో నొప్పి వచ్చింది. ఆ నొప్పితోనే కొన్ని బంతులు ఆడిన అనంతరం.. ఇక రిటైర్డ్ హార్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో సంజు 19 బంతుల్లో 31 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం అవుట్ కాకుండానే వెనుదిరిగాడు.

Also Read: MS Dhoni: వీల్ చైర్ పై మహిళ… ధోని చేసిన పనికి అందరూ షాక్ అవ్వాల్సిందే

ఈ మ్యాచ్ లో సంజు శాంసన్.. మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ధోని తన టి-20 కెరీర్ లో 346 సిక్స్ లు కొట్టగా.. సంజు ఈ మ్యాచ్ లో మూడు సిక్సర్లు కొట్టి ధోనీని మించిపోయాడు. ఇప్పుడు సంజు పేరు మీద టి-20 క్రికెట్ లో 347 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ అనంతరం తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు స్పష్టం చేశాడు సంజు. కానీ ఈరోజు స్కానింగ్ జరిగాక గాయం తీవ్రత పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతడు ఈ సీజన్ నుండి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక రాజస్థాన్ తన తర్వాతి మ్యాచ్ ని ఈ నెల 19న లక్నోతో ఆడనుంది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×