BigTV English
Advertisement

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Google Storage : ఆండ్రాయిడ్‌ ఫోన్స్​, కంప్యూటర్లు వాడే వారికి గూగుల్‌ స్టోరేజీ గురించి తెలిసిందే. గూగుల్‌ సర్వీసెస్​ వినియోగించేవారికి 15 జీబీ వరకు కాంప్లిమెంటరీ డేటాను గూగుల్‌ ఇస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌ వంటి వాటికి సంబంధించిన డేటా అంతా ఈ స్టోరేజీలోనే ఉంటాయి. అయితే చాలామందికి ఈ స్టోరేజీ ఫుల్‌ అయిపోతుంటుంది. అదనపు స్టోరేజీ కావాలంటే గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలి. నెలకు, ఏడాది, లేదా ఎంత జీబీ కావాలో దాని ఆధారంగా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజును పే చేయాలి. అయితే కొన్ని టిప్స్‌ పాటిస్తే మరి కొంతకాలం పాటు డబ్బులు చెల్లించకుండానే స్టోరేజీని కాపాడుకోవచ్చు.


ఏం చేయాలి అంటే? – గూగుల్‌ స్టోరేజీని క్లీనప్‌ చేయాలి. గూగుల్‌ ఫొటోస్‌, గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌ వంటి వాటిలో ఉన్న అనవసర డేటాను తొలగించాలి. పనికిరాని ఫైల్స్​ను డిలీట్‌ చేయాలి. ఈ పని త్వరగా చేయాలంటే మొబైల్​లో కాకుండా కంప్యూటర్​ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాలి. గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌కు వెళ్తే ఎంత స్టోరేజీ అవుతుంది, ఎందులో పెద్ద ఫైల్స్‌ ఉన్నాయో చూపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి డిలీట్‌ చేసుకోవాలి.

గూగుల్‌ ఫొటోస్‌ – గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజీలో ఎక్కువ భాగం గూగుల్‌ ఫొటోస్‌ వల్లే నిండిపోతాయి. అందుకే ముందుగా అవసరం లేని, బ్లర్ అయిన వీడియోలను తొలగించడం వల్ల ఎక్కువ ఫ్రీ స్పేస్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే డూప్లికేట్‌ ఇమేజ్‌లను డిలీట్‌ చేసినా కూడా స్టోరేజీ లభిస్తుంది.


ప్రమోషనల్​ మెయిల్స్‌ – ప్రమోషనల్‌ మెయిల్స్​ను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. దీని ద్వారా స్పేస్‌ను క్రియేట్‌ చేయొచ్చు. జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌లో చెక్‌బాక్స్‌ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్‌ మెనూపై క్లిక్‌ చేసి అక్కడ అన్‌రీడ్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి డిలీట్‌ బటన్‌ నొక్కితే అన్‌రీడ్‌ మెయిల్స్‌ను డిలీట్‌ అయిపోతాయి.

ALSO READ :  రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

లార్జ్‌ ఇ-మెయిల్స్‌ – కొన్నిసార్లు పెద్ద సైజు ఇ-మెయిల్స్‌ వస్తుంటాయి. లేదంటే మనం పంపిచాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాటిని తొలగించడం వల్ల కూడా తక్కువ సమయంలో ఎక్కువ స్పేస్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్‌బార్​లో has:attachment larger: 5M అని సెర్చ్‌ చేస్తే 5 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్‌ మెయిల్స్‌ కనిపిస్తాయి. వాటిని డిలీట్ చేయొచ్చు.

పాత మెయిల్స్‌ డిలీట్ – మనకు అవసరం లేని పాత ఇ-మెయిల్స్​ను తొలగించాలి. సెర్చ్‌ బార్‌లో అవసరం లేని పాత మెయిల్స్​ను సెలెక్ట్ చేసుకుని చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేసి డిలీట్‌ చేయాలి. లేదంటే ఫలానా సంవత్సరానికి ముందు(before:<2022> ఉదాహరణకు ) ఉన్న ఇ-మెయిల్స్‌ ఏమీ వద్దునుకుంటే, సెర్చ్​లో డేట్ క్లిక్ చేసి అవి రాగానే డిలీట్ చేసేయాలి.

గూగుల్‌ డ్రైవ్‌ – పీడీఎఫ్‌లను, డాక్యుమెంట్లను గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుస్తుంటాం. అయితే ఇ-మెయిల్‌ తరహాలో size:larger:5M అని సెర్చ్‌ చేస్తే 5 ఎంబీ కన్నా ఎక్కువ సైజున్న ఫైల్స్‌ను తీసేయొచ్చు. అలాగే పీడీఎఫ్‌లో పుస్తకాలు, ముఖ్యమైన ఇతర డాక్యుమెంట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని వేరే చోట భద్రపరుచుకోవాలి. అనంతరం డ్రైవ్‌ నుంచి వాటిని తొలగిస్తే ఎక్కువ స్టోరేజీ లభిస్తుంది.

జిప్‌ చేయాలి – అనవసరమైన ఫైళ్లను తొలగించినప్పటికీ స్టోరేజీ సరిపోకపోతే లార్జ్‌ ఫైల్స్‌ను డెస్క్‌టాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం గూగుల్‌ స్టోరేజీలో డిలీట్‌ చేయాలి. ఒకే తరహా ఫైల్స్‌ (వీడియోలు, పీడీఎఫ్‌లు) ZIP, RARను ఉపయోగించి కంప్రెస్‌ చేసి అప్‌లోడ్‌ చేయడంతతోనూ స్టోరేజీని కొంతవరకు తగ్గంచొచ్చు.

ఫ్యామిలీ స్టోరేజీ – కొందరు రెండు మూడు ఫోన్లకు ఒకటే గూగుల్‌ అకౌంట్‌ను వాడుతారు. దీనివల్ల రెండు ఫోన్లలోని డేటా బ్యాకప్‌ అయి స్టోరేజీ నిండిపోతుంది. కాబట్టి వేరే వేరే గూగుల్ అకౌంట్​ను క్రియేట్ చేసుకోవడం మంచిది.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×