Big Stories

GPT 3 training:- జీపీటీ 3 ట్రెయినింగ్ కోసం 7 లక్షల లీటర్ల నీరు..

GPT 3 training:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అనేది టెక్ ప్రపంచాన్ని శాసిస్తుంది అన్న విషయం మాత్రమే చాలామందికి తెలుసు. కానీ దాని వెనుక ఉండే టెక్నిక్స్, స్ట్రాటజీలు చాలా తక్కువమందికి తెలుసు. ఇక ఏఐ సామర్థ్యంతో మార్కెట్లోకి వచ్చిన చాట్‌జీపీటీ వెనుక కూడా ఎన్నో టెక్నిక్స్ ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే చాట్ జీపీటీ కంటే అడ్వాన్స్ వర్షన్‌గా మార్కెట్లోకి విడుదలయిన జీపీటీ 3 గురించి ఒక ఆసక్తికర విషయం వారు బయటపెట్టారు.

- Advertisement -

కృత్రిమ మేధస్సు అనేది మానవ మేధస్సు లాగా కాదు. దానికి ఏది అర్థమయ్యేలా చెప్పాలన్నా ప్రత్యేకంగా లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. అయితే ఇటీవల మార్కెట్లోకి విడుదలయిన జీపీటీ 3 వర్షన్‌ను ట్రెయిన్ చేయాలంటే డేటా సెంటర్స్‌కు నేరుగా 1 లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీరు కావాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంత నీటితో 370 బీఎమ్‌డబ్ల్యూ కార్లు లేదా 320 టెస్లా కార్లు తయారు చేయవచ్చని వారు అంటున్నారు. ఒక ఏఐ మోడల్‌కు ట్రెయినింగ్ కోసం నీరు ఎందుకు అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఏఐను ట్రెయిన్ చేయాలంటే ఒక వేర్‌హౌజ్ కావాలి, దానికి నిరంతరమైన పవర్ సప్లై ఉండాలి. ఈ వేర్‌హౌజ్ డేటా సెంటర్లను ఎనర్జీ హాగ్స్ అంటారు. అయితే ఇందులో జెనరేట్ అయ్యే కరెంటుకు డేటా సెంటర్ల సర్వర్లు చాలా వేడిగా అయిపోతాయి. వాటిని చల్లబరచడానికి చాలా నీరు కావాలి. అలాగే జీపీటీ 3ను ట్రెయిన్ చేయడానికి ప్రస్తుతం డేటా సెంటర్లు 7 లక్షల లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు డేటా సెంటర్లను చల్లబరిచినా కూడా ఏఐ చాట్‌బోట్స్ మాత్రం ఎప్పటికీ దాహంగానే ఉంటాయి.

న్యూక్లియర్ టవర్‌లో కూలింగ్ టవర్‌ను నింపడానికి సరిపోయే నీరు జీపీటీ 3ని ట్రెయిన్ చేయడానికి అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. పైగా జీపీటీ 3 ట్రెయినింగ్ సమయం ఎంత అని ఏఐ కూడా బయటపెట్టకపోవడంతో అసలు పూర్తిగా ఎంత శాతం నీరు దీనికి ఖర్చు అవుతుందని కనిపెట్టడం శాస్త్రవేత్తలకు కూడా కష్టంగానే మారింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అనేది కూడా ఏఐలో పెట్టుబడులు పెట్టి జీపీటీ 3 ట్రెయినింగ్‌కు సాయం చేస్తోంది.

చాట్ జీపీటీ 20 నుండి 50 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కూడా 500 మిల్లీలీటర్ల బాటిల్ నీటిని తీసుకోవాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. పైగా పరిసరాలను బట్టి ఈ నీటి శాతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు. మామూలుగా చూస్తే 500 మిల్లీలీటర్లు ఎక్కువ అని అనిపించకపోవచ్చు కానీ మొత్తంగా చాట్ జీపీటీ మాట్లాడడానికి ఎంత నీరును తీసుకుంటుంది అన్న వివరాలను లెక్కిస్తే మాత్రం అది ఎక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News