Studio Ghibli Style: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ మొదలైంది. సామాన్య వినియోగదారుల నుంచి సెలబ్రిటీల వరకు, అందరూ ఏఐ జనరేట్ చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే వీటి స్పెషల్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన టూల్స్ ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ AI Grok 3 నుంచి ఇమేజ్ జనరేషన్ టూల్ విడుదలైన క్రమంలో, OpenAI కూడా గట్టి పోటీతో వచ్చేసింది.
ఘిబ్లి స్టైల్ చిత్రాలు
ఇప్పటి వరకు AI జనరేటెడ్ ఆర్ట్ ఎక్కువగా స్టాక్ ఫోటోలాగా అనిపించేది. కానీ GPT-4o మాత్రం వినియోగదారుల కోసం ప్రత్యేకంగా స్టూడియో ఘిబ్లి వంటి ప్రత్యేక శైలి చిత్రాలను సృష్టిస్తోంది. ఈ టూల్ కేవలం కళాకారులకే కాకుండా, కంటెంట్ క్రియేటర్స్, మార్కెటింగ్ నిపుణులకు కూడా కొత్త అవకాశాలను అందిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ కొత్త టూల్ ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
GPT-4o ఇమేజ్ జనరేషన్ టూల్
ఇప్పటికే ఎలాన్ మస్క్ ఏఐ గ్రోక్ 3 నుంచి ఇమేజ్ జనరేషన్ టూల్ వచ్చేసింది. దీనికి పోటీగా OpenAI, చాట్‌జీపీటీ తాజాగా GPT-4o ఇమేజ్ జనరేషన్ టూల్ విడుదల చేసింది. ఈ టూల్ ద్వారా వినియోగదారులు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా స్టూడియో ఘిబ్లి స్టైల్ ఫోటోలను సృష్టిస్తుంది. OpenAI CEO సామ్ ఆల్ట్మన్ ఈ టూల్‌ను అద్భుతం, విపరీతంగా ఉపయోగపడే టెక్నాలజీ అని అభివర్ణించారు. మొదటిసారి ఈ టూల్ ద్వారా రూపొందించిన చిత్రాలను చూసినప్పుడు, అవి ఏఐ అంటే నమ్మలేకపోయానని ఆయన చెప్పారు.
ఎలా క్రియేట్ చేయాలి
దీని కోసం మీరు ChatGPTలో GPT-4o మోడల్‌ను ఎంచుకోవాలి. ఆ క్రమంలో ఒక ఫోటోను అప్‌లోడ్ చేయాలి. Transform this photo into Studio Ghibli style” వంటి ప్రాంప్ట్ ఇవ్వాలి. అప్పుడు అందుకు సంబంధించిన పిక్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత వాటిని మార్చుకోవాలంటే కలర్ ఛేంజ్ వంటి సూచనల ద్వారా మీకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు.
Read Also: Smart TV Offer: 40 ఇంచ్ స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ఆఫర్.. …
ఘిబ్లి స్టైల్ అంటే ఏంటి
ఘిబ్లి స్టైల్ అంటే జపాన్‌కు చెందిన ప్రఖ్యాత యానిమేషన్ స్టూడియో అయిన స్టూడియో ఘిబ్లి సృష్టించే విలక్షణమైన చిత్రాల కథన శైలిని సూచిస్తుంది. ఈ ఘిబ్లి చిత్రాలు ఎక్కువగా యానిమేషన్‌కు ప్రసిద్ధి. ఇందులో ప్రకృతి, నగరాలు, రోజువారీ జీవిత దృశ్యాలు సరికొత్తగా చిత్రీకరిస్తారు.
క్రియేటివ్ ఫీల్డ్స్‌లో విపరీతమైన వినియోగం
ఈ టూల్ క్రియేటివ్ ఫీల్డ్స్‌కి మంచి అవకాశమని చెప్పవచ్చు. ప్రధానంగా గేమ్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్, హిస్టారికల్ రీసెర్చ్ వంటి రంగాల్లో దీని వినియోగం పెరుగుతోంది. ఇది వినియోగదారులకు కొత్త ఫోటోలను క్రియేట్ చేసుకునేందుకు సులభతరం చేస్తుంది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ట్రెండ్
-స్టూడియో ఘిబ్లి స్టైల్: జపాన్ అనిమేషన్ ఫాన్స్‌కు ఇదొక మంచి గిఫ్ట్.
-సెలబ్రిటీల ప్రమోషన్: ఎలోన్ మస్క్ కూడా దీన్ని ఉపయోగించడం వల్ల మరింత వైరల్ అయింది
-సులభతరం అయిన AI ఆర్ట్ క్రియేషన్: డిజైనింగ్ స్కిల్స్ లేకుండా అద్భుతమైన చిత్రాలు క్రియేట్ చేయవచ్చు.
-క్రియేటివిటీకి బ్రేక్ లేదు: ఈ టూల్ వల్ల ఎవరైనా తమ ఊహాశక్తిని ఉపయోగించి అద్భుతమైన ఆర్ట్ రూపొందించవచ్చు.
ఈ ఫీచర్ ఉచితమా..
అయితే, ఈ ఫీచర్ వినియోగదారులకు ప్రస్తుతం ఉచితంగా లభిస్తుంది. కానీ పూర్తి వెర్షన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉండకపోవచ్చు. ChatGPT Plus, Pro సభ్యులకు సబ్‌స్క్రిప్షన్ (నెలకు $20 నుంచి ప్రారంభం) ఉండే ఛాన్సుంది. ఈ ఫీచర్ ఇంకా పూర్తిగా రోల్ అవుట్ కాలేదు. OpenAI దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. డెవలపర్లు API ద్వారా దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశాన్ని OpenAI అందించబోతోంది.