BigTV English

China Woman: కిలాడి లేడీ.. నకిలీ డాక్యుమెంట్లతో 80 ప్లాట్లు అమ్మేసింది.. రూ.28 కోట్లు కాజేసింది!

China Woman: కిలాడి లేడీ.. నకిలీ డాక్యుమెంట్లతో 80 ప్లాట్లు అమ్మేసింది.. రూ.28 కోట్లు కాజేసింది!

రియల్ ఎస్టేట్ అంటే మోసం అనే భావన చాలా మందిలో ఉంది. వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్న ప్లాట్లను అమాయకులకు అంటగట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటనలు అనేకం చూశాం. ఎక్కువగా పరిచయం లేని వ్యక్తులే ఈ దందాలో మోసపోతుంటారు. కానీ, తాజాగా ఓ మహిళ తన బంధువులు, మిత్రులతో పాటు నమ్మిన వారికే టోకరా పెట్టింది. నకిలీ పత్రాలతో ప్లాట్లను అంటగట్టి కోట్ల రూపాయలు వసూళు చేసింది.


నకిలీ డాక్యుమెంట్లతో మోసం  

చైనాలోని గన్సుకు చెందిన వాంగ్ వీ అనే 30 ఏండ్ల మహిళ చేసిన మోసం ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. 2017లో ఈమె చెంగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. విలాసవంతమైన లైఫ్ స్టైల్ కు అలవాటుపడిన ఆమె, విపరీతంగా అప్పులు చేసింది. ఆమె చేసిన అప్పులను తీర్చేందుకు భర్త చెంగ్ తన తమండ్రి నుంచి వచ్చిన ఆస్తిని తాకట్టుక పెట్టి సుమారు 4,50,000 యువాన్లు(రూ. 52 లక్షలు) అప్పు తీసుకున్నాడు. భార్య చేసిన అప్పులను తీర్చాడు. ఇప్పుడు తన ఆస్తిని కాపాడుకునేందుకు కష్టపడుతూ ప్రతినెల ఈఎంఐలను చెల్లిస్తున్నాడు. ఓవైపు భర్త కష్టపడుతున్నా, భార్య తన పద్దతి మార్చుకోలేదు. ఈజీ మనీ కోసం ఏకంగా నమ్మిన వారినే నట్టేట ముంచింది.


ఫోటోషాప్ సాయంతో నకిలీ ప్లాట్లు క్రియేట్  

గన్సుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్త బ్యాచ్ ఇళ్లను అమ్మేందుకు పత్రికా ప్రకటన ఇచ్చింది. దీన్ని వాంగ్ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఫోటోషాప్ సాయంతో ఫేక్ డాక్యుమెంట్లు, ఫ్లోర్ ఫ్లాన్ ను క్రియేట్ చేసింది. నకిలీ యాజమాన్యపత్రాలతో 80 ఫ్లాట్లు తనవే అని అపార్ట్ మెంట్ లోని గదులకు తాళాలు వేసే వారికి చెప్పింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చూపించడంతో వారు ఆమెను నమ్మారు. అయితే, అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పడకుండా చూసుకునేది.

5 ఏండ్లలో 80 ప్లాట్లు అమ్మకం

ఇక గత 5 ఏండ్లలో నకిలీ పత్రాలతో 80 ప్లాట్లు అమ్మింది. ఆమె తన అత్త, భర్త సోదరి, స్నేహితులకు సహా నమ్మిన వారికి ఈ ప్లాట్లు విక్రయించింది. మొత్తం 24 మిలియన్ యువాన్లు భారత కరెన్సీలో సుమారు రూ. 28 కోట్లు మోసం చేసింది.

మోసం చేసి సంపాదించిన డబ్బుతో..

ఇక దగ్గరి వారిని మోసం చేసి సంపాదించిన డబ్బును వాంగ్ ఆన్ లైన్ ద్వారా పరిచయం అయిన ప్రేమికుడి కోసం ఖర్చుపెట్టింది. 2022లో ఆన్ లైన్ ద్వారా హార్బిన్‌ కు చెందిన లైవ్ స్ట్రీమర్ జాంగ్ జెన్‌ పరిచయం అయ్యాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత అప్పు చేసి మరీ ఆమె అతడికి డబ్బులు పంపించేది. ఆమె జాంగ్ కోసం 9.8 మిలియన్ యువాన్లకు (₹11.5 కోట్లు) పైగా ఖర్చు చేసినట్లు తేలింది. అతడికి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చింది. పలు ఆస్తులు ఆస్తులను కొనిచ్చింది.

రీసెంట్ గా వాంగ్ మోసం బయటపడటంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఆన్ లైన్ స్ట్రీమర్ నుంచి డబ్బును రికవరీ చేసేందుకు పోలీసులు సహకరించారు. ఇప్పటి వరకు అతడి నుంచి 8 మిలియన్ యువాన్లు (రూ. 9.4 కోట్లు) రికవరీ చేశారు. మిగతా డబ్బులను చెల్లించేందుకు భర్త అంగీకరించడంతో ఆమెను పోలీసులు విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

Read Also: చైనాలో కొత్త కరోనా వైరస్, ప్రపంచాన్ని నాశనం చేసేలా ఉన్నారుగా మాస్టారూ?

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×