Gundeninda GudiGantalu Today episode march 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. అందరు కలిసి షీలా డార్లింగ్ ఊరికి వెళ్ళడానికి సిద్ధం అవుతారు. కానీ రవి, శృతిలు రాలేదని బాలు అంటాడు. ప్రభావతి నేను వెళ్లి తీసుకొస్తాను అంటుంది. అక్కడ శృతి రావడానికి ఇష్ట పడదు. రవి శృతిని ఒప్పించే పనిలో ఉంటాడు అది విన్న ప్రభావతి శృతి వస్తున్న రాదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఇలా మాట్లాడితే రాకుండా ఉండిపోతుందేమో అనేసి ప్రభావతి లోపలికి వెళ్లి అమ్మ శృతి ఏంటి ఇంకా రాలేదు రెడీ అవ్వలేదు ఏంటి మీ కోసం అందరు కింద వెయిట్ చేస్తున్నారని అంటుంది. లేదంటే నేను రావడం లేదు నాకు కొంచెం పని ఉంది అనేసి శృతి అంటుంది. నాకు పల్లెటూర్లు అంటే ఇది ఇష్టం ఉండదు. నేను రాను అని శృతి అంటుంది. కానీ ప్రభావతి మాత్రం నువ్వు ఒంటరిగా మీ పుట్టింటికి వెళ్తే ఏదో గొడవలు జరిగి వచ్చిందని అనుకుంటారు. అక్కడ నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానమ్మా. నువ్వు తప్పకుండా రావాలని ప్రభావతి అంటుంది ఇక శృతి మాట్లాడలేక వస్తాను ఒప్పుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సరదాగా ఆ ఊరిలోకి ఎంటర్ అవుతారు. సత్యం తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడతారు. అందరూ తమ ఫ్యామిలీ విషయాలు గురించి పంచుకుంటారు. సత్యం తన ఫ్రెండ్స్ తో సంతోషంగా గడుపుతాడు. అందరూ కలిసి ఆ రోజుల్లో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటారు. ఇక సత్యం తన కుటుంబాన్ని అందరినీ పరిచయం చేయగానే తన స్నేహితులు మూడు పువ్వులు ఆరు కాయలు అంటే మీ కుటుంబమే గుర్తొస్తుంది రా సత్యం అని అంటారు.. మా కుటుంబం ఇలాగే ఉమ్మడిగా ఉండాలని నా కోరిక నా కొడుకులును అలానే పెంచాను అని సత్యం గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటికే ఆలస్యమైంది అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మేం వెళ్ళొస్తామని చెప్పి అందరూ వెళ్లిపోతారు.
ఊర్లోని వీధులన్నీ తిరుగుతూ తమ సొంత ఇంటికి చేరుకుంటారు. ఇక అప్పటికే సత్యం వాళ్ల తల్లిగారు, బాలు నానమ్మ సుశీల వారి రాకకోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇక నానమ్మను చూసి ఆనందంలో బాలు వెళ్లి సుశీలమ్మను ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు. ఒరేయ్ ఒరేయ్ దించరా నన్ను ఎత్తుకుంటే ఏమొస్తది రా నీ పెళ్ళాన్ని ఎత్తుకో అనేసి బాలుతో శీల పరాచకాలు ఆడుతుంది. ఇక బాలు మీ నాన్న ఎత్తుకోవాలని చూస్తాడు కానీ మీనా మాత్రం తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నానమ్మ మంచి చెడుల గురించి తెలుసుకుంటాడు. ఇక సుశీలమ్మ కూడా మనవడు బాలుతో చమత్కారంగా మాట్లాడుతుంది. మరోవైపు తన మనవళ్లు, మనవరాళ్లను, కొడుకును మందలిస్తుంది. తన కోడలు ప్రభావతిని కూడా పలకరించి ఇంట్లోకి తీసుకెళ్తుంది.
అందరూ లోపలికి వెళ్ల వెళ్దామని వెళ్తటే రోహిణి మాత్రం బయటకు వెళ్తుంది.. ఏమైంది పాలరమ్మ టెన్షన్ పడుతుంది అందరూ లోపలికి వెళ్తుంటే ఈవిడ బయటికెళ్తుంది. ఏదో జరుగుతుందే అని బాలు అనుకుంటాడు. పాలరమ్మ ఏదో దాచి అందరిని మోసం చేయాలనుకుంటున్నామో అదేంటో కనిపెట్టాలి. అసలు వస్తున్నవాడు మలేషియా నుంచి చేస్తున్నాడా లేదా ఏదైనా మటన్ కొట్టు నుంచి వస్తున్నాడని బాలు అనుకుంటాడు.. అసలు నిజం ఏంటో నేను కనిపెడతాను అని బాలు అంటాడు.
అందరూ సరదాగా ఉంటే రోహిణి మాత్రం తన నాటకం బయటపడుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రభావతి ఆ ఇంటిని చూసి ఇందు కోసమేనా మమ్మీ అని కలవరిచ్చారు అని సత్యం ను అంటుంది. ఇక్కడున్న ఆ మర్యాదలు ఆప్యాయతలు నీకు అర్థంకావు.. నువ్వు ఎప్పుడూ డబ్బులు గురించి ఆలోచిస్తూ నీ స్వార్థం నువ్వు చూసుకుంటావని సత్యం ప్రభావతికి క్లాస్ పీకుతాడు. మీనా మాత్రం సుశీలమ్మకి సాయంగా అన్ని పనులు తానే చేసేందుకు ముందుకు వస్తుంది. ఇక సుశీల కూడా తన మనవరాలు తనలాగే అన్నిట్లో ముందుంటుంది. అని గొప్పగా చెప్పుకుంటుంది అది విన్న బాలు మీనా గురించి గొప్పగా చెప్పడంతో సంతోషపడతాడు.
శృతిరవిల్ కూడా లోపలికి వెళ్ళగానే చాలా బాగుంది ఇళ్లు అనేసి శృతి పొగుడుతుంది. రవి అమ్మయ్య నేను సేఫ్ అయ్యాను నీకు ఇది నచ్చింది కదా నువ్వు ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంటాడు. అయితే రోహిణి మాత్రం మటన్ కొట్టు మాణిక్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రోహిణి చూసినా బాలు మాత్రం పార్లరమ్మ ఏదో టెన్షన్ పడుతుంది. ఏదో గుడుపుటని జరుగుతుంది.. తెలుసుకుంటా మామ ఎవరో కనిపెట్టేస్తా అని రోహిణి పై కన్నేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి మలేషియా డ్రామా బయట పడుతుందేమో చూడాలి..