Big Stories

Rheumatoid Arthritis:- గ్రిల్ చికెన్ వల్ల యువతలో అలాంటి సమస్యలు..

Rheumatoid Arthritis:- ఈరోజుల్లో ఆహార పదార్థాలు బయటికి చూడడానికి బాగానే అనిపిస్తున్నాయి. కానీ ఏది తింటే ఏం సమస్య వస్తుందో అని అనుమానంతోనే చాలామంది పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఏది తిన్నా దాని వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుందని పలువురు భయపెట్టడం మొదలుపెట్టారు. వారు చెప్పేవాటిలో కూడా చాలావరకు నిజాలు ఉంటున్నాయి. తాజాగా బార్బిక్యూ చికెన్ కూడా ఒక ఆరోగ్య సమస్యకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

చికెన్ అంటే ఇష్టపడే సంఖ్య భారీగానే ఉంటుంది. అంతే కాకుండా చికెన్‌ను రకరకాలుగా వండడానికి ట్రై చేసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రస్తుతం రెస్టారెంట్లలో చాలారకాల చికెన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి గ్రిల్ చికెన్. గ్రిల్ చికెన్ అనేది గత కొన్నేళ్లుగా చాలా ఫేమస్ అయిపోయింది. రెస్టారెంట్లలో మాత్రమే కాదు.. ఇళ్లల్లో కూడా గ్రిల్ చికెన్‌ను తయారు చేసుకొని తినడానికి ఇష్టపడుతున్నారు ఫుడ్ లవర్స్. అయితే ఈ గ్రిల్ చికెన్ వల్ల కీళ్ల నొప్పులు కలిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు షాకిచ్చారు.

- Advertisement -

గ్రిల్ చికెన్ అనేది కీళ్ల జాయింట్ సెల్స్‌పై ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే చికెన్‌ను గ్రిల్ చేసేటప్పుడు పోలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్)లు విడుదలవుతాయి. దాని కారణంగానే జాయింట్స్‌పై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పీఏహెచ్‌లు అనేవి ఇప్పటికే గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. బొగ్గు, నూనె, గ్యాస్, చెక్క లాంటివి కాల్చే సమయంలో పీఏహెచ్‌లు విడుదలవుతాయి. దాని కారణంగా గాలిలో కాలుష్యం శాతం పెరిగిపోతోంది. అంతే కాకుండా ధూమపానం వల్ల కూడా పీఏహెచ్‌లు రిలీజ్ అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ధూమపానం అలవాటు ఉన్నవారి శరీరంలో పీఏహెచ్ శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో పాటు పీఏహెచ్ ఉన్న గ్రిల్ చికెన్ తినేవారిలో కూడా కీళ్లనొప్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చేసిన స్టడీలో తేలింది. చాలావరకు కీళ్లనొప్పులతో బాధపడుతున్నవారిలో యువత కూడా ఉన్నారని స్టడీ వెల్లడించింది. అయితే పీఏహెచ్ శాతాన్ని గాలి నుండి పూర్తిగా వేరు చేయడం కష్టమని, కానీ దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News