E-Paper
Advertisement

ఐఐటీ కాన్పూర్ చీపెస్ట్ ఏసీ.. రోజుకు రూ.30 మాత్రమే.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

ఐఐటీ కాన్పూర్ చీపెస్ట్ ఏసీ.. రోజుకు రూ.30 మాత్రమే.. మిడిల్ క్లాస్‌కు పండుగే!
Advertisement

Helium AC: వేసవిలో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కరెంటు బిల్లుల భారం సైతం అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు కొత్తగా ఏసీలు కొనాలన్నా, దాన్ని వాడాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం మార్కెట్లోని పాత తరం బ్రాండ్లు.. పెద్ద పెద్ద ఏసీలను అధిక ధరలకు విక్రయిస్తుండటం కూడా సామాన్యులకు గుదిబండలా మారుతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ హీలియం స్మార్ట్ ఎయిర్ (Helium Smart Air) అనే సరికొత్త స్టార్టప్ కంపెనీ మార్కెట్లోకి వచ్చింది. ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) పూర్వ విద్యార్థులైన ఆశిష్ శర్మ, అమన్ ముంకా కలిసి ఈ స్టార్టప్‌ను స్థాపించారు. సామాన్యుల ఇళ్లు, వారి బడ్జెట్‌కు సరిపోయేలా ఒక స్మార్ట్ ఏసీని తయారు చేశారు. దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అసలేంటీ హీలియం స్మార్ట్ ఎయిర్?

గది విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలా కంపెనీలు 1.5 టన్ ఏసీలను కొనుగోలు చేసేలా కస్టమర్లను ప్రోత్సహిస్తున్నాయి. అంత పెద్ద ఏసీని చిన్న షాపు లేదా ఇంట్లో పెడితే.. అది అవసరానికి మించి కూలింగ్ ఇవ్వడంతో పాటు.. విద్యుత్ భారాన్ని అమాంతం పెంచేస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా హీలియం సంస్థ.. 0.8 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (0.8 Ton Inverter Split AC) ని తీసుకొచ్చింది. ఇది 100 నుండి 120 చదరపు అడుగుల లోపు ఉండే గదులకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

Advertisement

ఈ ఏసీ కోసం సరికొత్త కూలింగ్ టెక్నాలజీని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అలాగే దీనిలో ఇన్‌బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ సాఫ్ట్‌వేర్ ను సైతం పొందుపరిచారు. ఇవి గదిలోని ఉష్ణోగ్రతను బట్టి కంప్రెషర్ స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. దీనివల్ల సాధారణ ఏసీల్లాగా పదే పదే ఆన్, ఆఫ్ అవుతూ కరెంటును విపరీతంగా ఖర్చు చేయడం ఈ ఏసీలో ఉండదు. ఫలితంగా పవర్ బిల్లు చాలా వరకూ ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ ఏసీని స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసి.. ట్రాక్ చేసే వెసులుబాటును కల్పించారు.

హీలియం vs సాధారణ ఏసీలు

హీలియం ఏసీకి ఉన్న మరో అతిపెద్ద ప్లస్ పాయింట్ గా దీని ధరను చెప్పవచ్చు. మార్కెట్లో దొరికే సాధారణ 1.0 టన్ లేదా 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ కొనాలంటే రూ.28,000 నుండి రూ.42,000 వరకు ఖర్చవుతుంది. కానీ హీలియం 0.8 టన్ ఏసీ కేవలం రూ.16,990 ప్రారంభ ధరకే లభిస్తోంది. అంటే సాధారణ ఏసీల కంటే ఇది వేల రూపాయలు తక్కువకే వస్తుందని చెప్పవచ్చు.

రోజుకు రూ.30 ఖర్చు..

Advertisement

విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించడంలో హీలియం స్మార్ట్ ఎయిర్ ఏసీలు ముందు వరుసలో ఉంటాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇది రోజుకు కేవలం రూ.30 ఖర్చుతోనే నడుస్తుందని పేర్కొంటున్నారు. అదే ఒక పెద్ద ఏసీని చిన్న గదిలో ఆన్ చేస్తే రోజుకు రూ.60 నుండి రూ.100 వరకు పవర్ బిల్లు వస్తుందని ఈ లెక్కన హీలియం ఏసీ వాడటం వల్ల కరెంట్ బిల్లు 20 శాతం నుండి 50 శాతం వరకూ ఆదా చేయవచ్చని తెలియజేస్తున్నారు.

Also Read: రాత్రంతా ఏసీ వేసినా కరెంట్ బిల్లు రాకూడదా? రిమోట్లోని ఈ ‘మ్యాజికల్’ బటన్ నొక్కాల్సిందే!

హీలియం ఏసీని ఎలా కొనాలి?

హీలియం ఏసీని అధికారిక వెబ్ సైట్ లో నేరుగా ఆర్డర్ చేయవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. అక్కడ కొంటే లాంచ్ డిస్కౌంట్లు, ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ, ఎక్స్‌టెండెడ్ వారంటీ లాంటి ఆఫర్లు లభిస్తాయని పేర్కొన్నాయి. అలా కాకుండా ప్రొడక్ట్ ను స్వయంగా చూసి కొనాలని భావిస్తే.. మెట్రో నగరాల్లో ‘ఎక్స్ పీరియన్స్ స్టోర్స్’ ను సంప్రదించవచ్చని సూచించాయి. మరోవైపు అమెజాన్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో కూడా హీలియం ఏసీలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Also Read: మీ ఫోన్ మీపైనే నిఘా పెట్టిందా? వెంటనే ఇలా చేయకపోతే.. తప్పదు భారీ మూల్యం!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×