E-Paper
Advertisement

‘మహానాడు’ వేదికగా సరికొత్త రికార్డు.. లోకేష్ బాధ్యతలపై ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు!

‘మహానాడు’ వేదికగా సరికొత్త రికార్డు.. లోకేష్ బాధ్యతలపై ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు!
Advertisement

MP Sribharat: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ మహానాడు’ పండుగ విశాఖపట్నంలో సరికొత్త సాంకేతికతతో, పసుపు శ్రేణుల ఉత్సాహం మధ్య ఘనంగా జరిగింది. ఈ సారి మహానాడును సరికొత్త ‘ హైబ్రిడ్ విధానంలో’ నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం 1,850 క్లస్టర్లలో  డిజిటల్ పద్ధతిలో స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 82 క్లస్టర్లలో నాయకులు, కార్యకర్తలు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్లస్టర్ పరిధిలో జరిగిన మహానాడు కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్వయంగా పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు.

పెట్టుబడుల వెల్లువ.. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’

Advertisement

ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ.. పార్టీ సాధించిన ఆర్థిక, పారిశ్రామిక విజయాలను కొనియాడారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే బలమైన నినాదంతో ముందుకు వెళ్లడం వల్లే రాష్ట్రం పారిశ్రామికంగా సక్సెస్ అయిందని ఆయన స్పష్టం చేశారు. దీనికి నిదర్శనంగా.. గత ఏడాది దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌ కైవసం చేసుకుందని ఆయన గర్వంగా ప్రకటించారు.

యువతకు పెద్దపీట.. మహిళలకు ఆహ్వానం

Advertisement

రాజకీయాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయని చెబుతూ, భవిష్యత్తు నాయకత్వంపై శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులకు పబ్లిక్ పాలసీతో పాటు క్రియాశీలక రాజకీయాల్లో టీడీపీ పెద్దపీట వేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో మహిళా బిల్లు (చట్టం) రావడం ఖాయమని చెప్తూ.. పార్టీలోకి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.

లోకేష్ నాయకత్వంలో సరికొత్త శకం

పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై మాట్లాడుతూ.. నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం అత్యంత శుభసూచకమని ఎంపీ అభివర్ణించారు. యువత ఆలోచనలకు తగ్గట్టుగా, లోకేష్ సమర్థవంతమైన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మరింత బలంగా, వేగంగా ప్రజా బాహుళ్యంలోకి దూసుకుపోతుందని భరత్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: కామారెడ్డి వేదికగా TPCC చీఫ్ ఫైర్.. సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×