Holi Dhamaka Offer: హోలీ పండుగ సందర్భంగా మీరు మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ మోటరోలా Edge 50 Fusionపై క్రేజీ ఆఫర్లను అనౌన్స్ చేసింది. దీని అసలు ధర రూ. 27,999 కాగా, ప్రస్తుతం 17 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. అయితే ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరకు ఎలా వస్తుంది, దీని ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు డిస్‌ప్లేను మరింత ఆకర్షణీయంగా ఉంచుతాయి. డిజైన్ పరంగా మార్ష్‌మల్లో బ్లూ, హాట్ పింక్ రంగుల్లో లెదర్ ఫినిష్‌తో ఫారెస్ట్ బ్లూ రంగులో అందుబాటులో ఉంది. 7.9 మిల్లీమీటర్ల మందం, 175 గ్రాముల బరువు కలిగి ఉన్న ఈ ఫోన్ లైట్‌వెయిట్ డిజైన్‌ను కల్గి ఉంటుంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ UFS 2.2 స్టోరేజ్‌తో, వినియోగదారులకు వేగవంతమైన స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
Read Also: Bluetooth Earphones: రూ. 699కే బ్లూటూత్ హెడ్‌ఫోన్స్.. ఏడాది వారంటీతోపాటు
కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 700C ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కల్గి ఉంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఓఐఎస్ వంటి ఫీచర్లు ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత పెంచుతాయి.
ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 68 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను తక్కువ సమయంలోనే పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ను మోటరోలా సంస్థ 2024 మే 16న భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 27,999గా నిర్ణయించారు. దీనిపై ఆఫర్ ప్రకటించి ప్రస్తుతం రూ. 22,999కే అందిస్తున్నారు. కానీ మీరు ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత తక్కువ ధరకు ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎలాగంటే మీ ఫోన్ మోడల్ ఆధారంగా దాదాపు రూ. 8 వేల వరకు తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. అంటే 22 వేల రూపాయలు ఉన్న ఫోన్ మీకు, 14 వేల రూపాయలకే లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, మోటరోలా, కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఇంకా డిస్కౌంట్ లభిస్తుంది.
Read Also: TV Offers: 108 సెం.మీ. స్మార్ట్ టీవీపై బెస్ట్ ఆఫర్.. వేలల్లో తగ్గింపు..