Ravindra Jadeja: దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా విజేతగా నిలిచింది. తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ లోని నాలుగు క్యాష్ లను టీమిండియా ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. అటు న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా కొన్ని క్యాచులను వదిలివేశారు. అయితే టీమ్ ఇండియా సూపర్ ఫీల్డర్ రవీంద్ర జడేజా {Ravindra Jadeja} మాత్రం పరుగులను ఆపడంలో కీలకపాత్ర పోషించాడు.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌ను పరుగెత్తించిన జడేజా కూతురు !
దీంతో ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ బెస్ట్ ఫీల్డ్ మెడల్ ని సొంతం చేసుకున్నాడు రవీంద్ర జడేజా. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ చేతుల మీదిగా జడేజా ఈ మెడల్ ని స్వీకరించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో జడేజా ఎక్కువగా వికెట్లు పడగొట్టకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా కీలక ప్లేయర్ టామ్ లాథమ్ వికెట్ పడగొట్టడమే కాకుండా.. తన కోటలోని 10 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అలాగే మిడిల్ ఓవర్లలో చాలా పొదుపుగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ టోర్నీలో మొదటి నుండే జడేజా ఇలాంటి ప్రదర్శనలతోనే ఆకట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో జడేజా ఐదు మ్యాచ్ లలో 4.36 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనంతరం రవీంద్ర జడేజా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి.
ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో అతడి 10 ఓవర్ల కోట పూర్తి అయిన అనంతరం విరాట్ కోహ్లీ హగ్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ వాతావరణం కనిపించింది. దీంతో రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ టోర్నీలో అటు బౌలింగ్, ఇటు అద్భుతమైన ఫీల్డింగ్, ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ తో తన ఫిట్నెస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు రవీంద్ర జడేజా.
Also Read: Dhoni Biryani Controversy: హైదరాబాద్ బిర్యానీ కోసం ధోని హోటల్ మారిపోయాడు.. అంబటి సంచలనం !
విన్నింగ్ షాట్ అనంతరం ఈ మ్యాచ్ చూడడానికి తన తన భార్యకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అనంతరం తన బ్యాట్ తో పుష్పరాజ్ స్టైల్ లో ” ఇది సార్ నా బ్రాండ్ ” అనే విధంగా అల్లు అర్జున్ తరహాలో బ్యాట్ తో సైగలు చేశాడు. దీంతో రవీంద్ర జడేజా చేసిన ఈ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఈ విచిత్రమైన సంబరాలు చేసుకోవడంలో కరేబియన్లు ముందుంటారు. వారు రకరకాలుగా వేడుకలు చేసుకుంటారు. ఇక భారత జట్టులో ఇలాంటి సంబరాలు చేసుకోవడంలో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ ముందుంటారు.
https://twitter.com/Cricketracker/status/1898998745561280836