Mivi DuoPods i6: తక్కువ ధరల్లో బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ తీసుకోవాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. తాజాగా Mivi సంస్థ DuoPods i6 TWS మోడల్ హెడ్‌ఫోన్స్ పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే వీటిలో ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ఎలా పనిచేస్తాయి, వారంటి ఎలా ఉందనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Mivi DuoPods i6 TWS డిజైన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ హెడ్‌ఫోన్స్ చిన్నవిగా ఉండి, ఒకటి కంటే ఎక్కువ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకంగా ఇవి ట్రైనింగ్, రన్నింగ్ సహా అనేక సమయాలలో మీకు సౌకర్యవంతంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.
Mivi Duo Pods i6 TWS హెడ్‌ఫోన్ IPX 4.0 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ సౌలభ్యాన్ని కల్గి ఉంది. ఇది వర్షం లేదా సాధారణ వాడకంలో నీటిని తట్టుకుని సురక్షితంగా పనిచేస్తుంది. ఆటగాళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎందుకంటే ఇవి వర్కౌట్ లేదా ఫిట్ నెస్ చేసే క్రమంలో సులభంగా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.
Read Also: Women’s Day Sale: ఉమెన్స్ డే ఆఫర్ సేల్.. రూ.7 వేలకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్
Mivi DuoPods i6 TWSలో 13mm బాస్ స్పీకర్లను ఉపయోగించారు. తద్వారా మీరు స్మూత్‌గా సౌండ్ క్లారిటీని ఆస్వాదించవచ్చు. ఈ క్రమంలో మీరు సంగీతం వినడం లేదా ఆటలను ఆడే సమయంలో కూడా ఈ బాస్ స్పీకర్లు మంచి క్లారిటీతో అధిక సౌండ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మీకు సంగీత లేదా వాయిస్ సందేశాల విషయంలో ఎంతో స్పష్టతను అందిస్తాయి.
ఇవి ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు 55 గంటలకు పైగా బ్యాటరీ లైఫ్‌ను పొందుతారు. దీంతోపాటు హెడ్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్ కూడా పెద్దదిగా వస్తుంది. ఇది మంచి బేస్ సౌండ్ ఇస్తూ వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీంతో మీరు రోజూ వీటిని ఉపయోగిస్తూ ఎక్కువ సమయం వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
ఇది బ్లూటూత్ 5.0 టెక్నాలజీని ఉపయోగించి కనెక్షన్‌ను అందిస్తుంది. ఫాస్ట్ కనెక్షన్, ఆన్-డిమాండ్ రిజల్యూషన్‌కు గ్యారంటీ అందిస్తుంది.
ఈ హెడ్‌ఫోన్‌లో మైక్రోఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. తద్వారా మీరు హ్యాండ్ ఫ్రీ కాల్స్ చేసుకోగల్గుతారు. ఇవి స్పష్టమైన వాయిస్‌ను అందించడంలో సహాయపడతాయి. వీటి అసలు ధర రూ. 3,499 కాగా, 80 శాతం డిస్కౌంట్ ధరతో ప్రస్తుతం రూ.699కే ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది.