Group-1 Results: టీజీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులు గుడ్ న్యూస్. గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. తెలంగాణలో 563 గ్రూప్-1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచింది.
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా ప్రధాన పరీక్షల మార్కుల వివిరాలను టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ లో పేర్కొంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది.
కింద ఉన్న వెబ్ సైట్ ను క్లిక్ చేసిన డైరెక్ట్ గా ఫలితాలు తెలుసుకోవచ్చు.
అధికారిక వెబ్ సైట్: tspsc.gov.in
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో 67.17 శాతం హాజరు నమోదైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత పొందిన అభ్యర్థులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో ప్రధాన పరీక్షలు రాశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం ఏడు పేపర్లకు 21,093 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. అక్టోబర్ 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబర్ 27 తో ముగిశాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,403 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వీళ్లలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్ క్యాటగిరీ అభ్యర్థులు కూడా ఉన్నారు.
ALSO READ: ICAR Recruitment: డిగ్రీ అర్హతతో ICARలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. జీతమైతే రూ.60,000
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పేపర్ల వారీగా పొందిన మార్కులను ఈ రోజు నుంచి మార్చి 16 సాయంత్రం 5.00 గంటల వరకు ఒక వారం పాటు సంబంధిత అభ్యర్థుల లాగిన్‌లో ఉంచుతారు. అభ్యర్థులు తమ TGPSC ID, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఓటీపీ ఆధారంగా కమిషన్ వెబ్‌సైట్‌లో పేపర్ వారీగా మార్కులను పొందవచ్చు. అభ్యర్థులు మెయిన్స్ మెమోరాండం ఆఫ్ మార్క్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నియామకం పూర్తయ్యే వరకు దానిని భద్రపరచాలని టీజీపీఎస్సీ అధికారులు సూచించారు.