Honda Elevate Black Edition : ప్రముఖ కార్స్ తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా.. మిడ్ సైజ్ SUV హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌ను లాంఛ్ చేయబోతోంది. రీసెంట్గా ఈ వెర్షన్ ప్రొడక్షన్ రెడీ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటంతో త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆటో మెుబైల్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎడిషన్ జనవరి 7న లాంఛ్ కానుందని తాజాగా హోండా వెల్లడించింది.
హోండా కార్స్ ఇండియా ఈ SUVని రెండు వెర్షన్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాటిలో మొదటిది ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కాగా… ఇక రెండోది ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్. ఇక ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. ఈ స్పెషల్ ఎడిషన్ జనవరి 7న లాంఛ్ కానున్నట్లు సమాచారం.
Honda Elevate Black Edition Design –
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ను హోండా కంపెనీ స్పెషల్ గా డిజైన్ చేసింది. ఇక క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ ఎక్స్‌టీరియర్ పెయింట్, గ్లోస్ బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్ తో వచ్చేసింది. కారుకు పైన ఉండే గ్రిల్‌పై క్రోమ్ ఫినిషింగ్ తో పాటు రూఫ్ రైల్స్ పై సిల్వర్ ఫినిషింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనుంది. ఇక డోర్స్ కు దిగువ భాగంలో సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక కార్ ఇంటీరియర్ పై సైతం హోండా స్పెషల్ ఫోకస్ పెట్టి ఆల్ బ్లాక్ లెథెరెట్ సీట్లతో తీసుకొస్తుంది.
అయితే హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కు ఎక్ట్సీరియర్ తో పాటు ఇంటీరియర్, అల్లాయ్ వీల్స్ కూడా ఒకే విధమైన డిజైన్ తో రాబోతుంది. ఇది బ్లాక్ పెయింటెడ్ అప్పర్ గ్రిల్ తో డిజైన్ కాగా.. రూఫ్ రైల్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్లతో వచ్చేస్తుంది. వీటితో పాటుగా డోర్స్ దిగువ భాగంలో బ్లాక్ ఫినిషింగ్ కూడా మరో స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
ఈ కార్లు బెస్ట్ ఫీచర్స తో టాప్ వేరియంట్స్ గా రానున్నాయి. ఇక ఎలివేట్ బ్లాక్, ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌లు హై ఎండ్ కార్స్ గా నిలవనున్నాయి. వీటిలో సింగిల్ పేన్ సన్ రూఫ్ తో పాటు ఆటో హెడ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇక వైపర్స్, 7.0 అంగుళాల TFT డిస్‌ప్లేతో రాబోతున్నాయి.
ఈ ఫీచర్స్ తో పాటు సెమీ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. కెమెరా బేస్డ్ ADAS సూట్ వంటి స్పెషల్ ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఈ ప్రత్యేక వేరియంట్లో ఫ్రంట్ ఫెండర్‌తో 7 రంగుల ఇంటీరియర్ యాంబియంట్ స్పెషల్ లైటింగ్‌పై హోండా లోగో కూడా ఉండనుంది.
Honda Elevate Black Edition Powertrain –
ఈ హోండా కొత్త స్పెషల్ ఎడిషన్ లో పవర్‌ట్రైన్ ముందు ఎడిషన్స్ తో సమానంగా ఉంది. ఇప్పటికే పాత మోడల్స్ లో ఉన్న 1.5 లీటర్ తో పాటు 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను ఈ మోడల్ లో కూడా అందిస్తున్నారు. 120 bhp పవర్, మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో స్పెషల్ ఎడిషన్ వచ్చేస్తుంది. ఇక ఈ కార్స్ రూ. 16 లక్షల నుంచి రూ. 17 లక్షల ప్రైజ్ రేంజ్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : ఫోటో లవర్స్ బీ రెడీ! 64MP మెుబైల్స్ పై దిమ్మతిరిగే డీల్స్ వచ్చేశాయ్