64MP Mobiles : మీరు ఫోటో ప్రియులా? ఫోన్లో కెమెరాతో బెస్ట్ ఫొటోస్ తీయాలనుకుంటున్నారా? అదిరిపోయే ఫీచర్స్ తో పాటు దిమ్మ తిరిగే కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్స్ కోసం సర్చ్ చేస్తున్నారా? ఇక ఇంకెందుకు ఆలస్యం.. తాజాగా టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు 64MP కెమెరా మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. వీటిలో కెమెరా క్వాలిటీతో పాటు స్టోరేజ్ సదుపాయం సైతం అదిరేలా ఉంది. బెస్ట్ బ్యాటరీతో పాటు డిస్ ప్లే ఫీచర్స్ సైతం కిర్రాక్ గా ఉన్నాయి. ఇక ఇందులో టాప్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం.
బెస్ట్ కెమెరా ఫీచర్ మొబైల్స్ ను తీసుకొచ్చేసిన టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ సంస్థలు.. అతి తక్కువ ధరకే ఈ మెుబైల్స్ ను అందుబాటులో ఉంచాయి. వీటిలో టెక్నో, రియల్ మీ, ఒప్పో, లావా, ఐక్యూ మొబైల్స్ టాప్ ఆప్షన్స్ గా ఉన్నాయి. వీటి ధరలు సైతం అందుబాటులోనే ఉండగా టాప్ మెుబైల్స్ లిస్ట్ ఇదే.
Realme narzo N55 –
Realme narzo N55 మెుబైల్ లో 64MP ప్రైమరీ AI కెమెరా, 12GB డైనమిక్ ర్యామ్, 6GB వరకూ ఆన్‌బోర్డ్ RAM, అదనంగా 6GB వరకు డైనమిక్ ర్యామ్ ఉన్నాయి.
TECNO Camon 20 –
TECNO కామన్ 20 మెుబైల్ లో 64MP RGBW బ్యాక్ కెమెరా, 6.67 FHD+ బిగ్ AMOLED ఇన్ డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
Realme 11x 5G –
Realme 11x 5G మెుబైల్ లో 64MP+ 2MP + 8MP ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 33 W SUPERVOOC ఛార్జ్‌తో 5000 mAh బ్యాటరీతో వచ్చేసింది.
Lava Blaze X 5G –
లావా బ్లేజ్ X 5G మెుబైల్ 64MP సోనీ సెన్సార్ కెమెరా, 16GB RAM, Widevine L1 DRM ప్రొటెక్షన్‌తో 16.94 cm 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉన్నాయి.
OPPO F27 Pro 5G –
OPPO F27 Pro+ 5G మెుబైల్ లో 64MP AI ఫీచర్డ్ కెమెరా, 67W సూపర్‌వూక్, 6.7 FHD+ AMOLED 3D కర్వ్డ్ డిస్ ప్లే తో లాంఛ్ అయింది.
HMD Crest Max 5G –
HMD క్రెస్ట్ మ్యాక్స్ 5G మెుబైల్ 64 MP ప్రైమరీ సోనీ సెన్సార్, FHD+ OLED డిస్ ప్లే, 8 GB RAM + 256 GB స్టోరేజ్ తో వచ్చేసింది. ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
Lava Blaze Curve 5G –
లావా బ్లేజ్ కర్వ్ 5G మెుబైల్ 64 MP ప్రైమరీ సోనీ సెన్సార్, డైమెన్సిటీ 7050 6nm ప్రాసెసర్ తో వచ్చేసింది. ఇక ఈ మెుబైల్ ధర రూ.14,499.
IQOO Z7 Pro 5G –
iQOO Z7 Pro 5G మెుబైల్ 4nm మీడియాటెక్ డైమెసిటీ 7200 5G ప్రాసెసర్, 64MP ఆరా లైట్ OIS కెమెరాతో వచ్చేసింది. ఇది సరికొత్త 4nm ఎనర్జీ ఎఫిషియంట్ తో 7200 5g ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ALSO READ : యాపిల్ కోసం రంగంలోకి దిగిన శామ్‌సంగ్.. ఐఫోన్ 18లో దిమ్మ తిరిగే ఫీచర్