Pawan Kalyan..సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరో, హీరోయిన్లు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత వారి వారసులు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు అని, ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లను కాస్త పక్కన పెడితే, హీరోల వారసుల కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. ఇప్పటికే బాలయ్య (Balayya) వారసుడు మోక్షజ్ఞ(Mokshagna) అలాగే మహేష్ బాబు(Mahesh Babu), వారసుడు గౌతమ్ ఘట్టమనేని (Gautham ghattamaneni)ల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం చలామణి అవుతున్న ప్రముఖ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకు అకీరా నందన్ (Akhira Nandan) ఎంట్రీ కోసం కూడా అభిమానులు అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.
ఇక ఎప్పుడో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నా.. ఉన్నత చదువుల నిమిత్తం ఆయన ఇండస్ట్రీ వైపు అడుగులు వెయ్యలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే తాజాగా అకీరా నందన్ ఇండస్ట్రీ ఎంట్రీ పై ఆయన తల్లి రేణూ దేశాయ్ (Renu Desai) ఊహించని కామెంట్లు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూ దేశాయ్ తన కొడుకు ఎంట్రీ పై స్పందించారు. రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. “ఒక తల్లిగా అందరికంటే ఎక్కువగా ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నాను. అది ఆయన ఇష్టం. నేను పదేపదే ఇదే విషయాన్ని మీడియాకు కూడా చెబుతున్నాను. అకీరా ఎప్పుడు అంటే అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఉంటుంది” అంటూ రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికైతే కొడుకు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ పై కామెంట్స్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోషపరిచింది రేణూ దేశాయ్.
ఇదిలా ఉండగా.. మరొకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటిస్తున్న ఓ.జీ (OG) సినిమా ద్వారా అకీరా నందన్ అరంగేట్రం చేస్తున్నారని, గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అకీరా నందన్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి అకీరా తన నిర్ణయాన్ని ఎప్పుడు బహిరంగంగా ప్రకటిస్తారో చూడాలి.
పవన్ కళ్యాణ్ కెరియర్..
ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన, రాజకీయంగా దీనిపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకపోతే అన్నింటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక మరొకవైపు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ , ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు చేయాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా విడుదలపై కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాను ఈ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇచ్చానని, కానీ చిత్ర యూనిట్ తన డేట్స్ ఉపయోగించుకోలేదు అంటూ తెలిపారు. మరి ఎట్టకేలకు మూడు సినిమాలను లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత తెరపై చూడాలని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.