Honor 200 5G : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ ఈ ఏడాది హానర్ 200 5G (Honor 200 5G) మొబైల్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొబైల్ లేటెస్ట్ ఫీచర్స్ తో బెస్ట్ మొబైల్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ పై అమెజాన్లో అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. అతి తక్కువ ధరకే బెస్ట్ మొబైల్ కొనాలనుకునే యూజర్స్ కు ఇదే బెస్ట్ ఛాయిస్.
Honor 200 5G మెుబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ అదిరిపోయే ఆఫర్స్ ను అందిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 26,999కే ఈ మెుబైల్ అందుబాటులో ఉంది. కస్టమర్లు రూ. 3,000 కూపన్‌ను కూడా పొందవచ్చు. దీంతో రూ. 23,999కే కొనే ఛాన్స్ ఉంది. ఈ మెుబైల్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ లో రూ. 22,800 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఇక ఈ మెుబైల్ పై బ్యాంక్ ఆఫర్‌లతో పాటు నో కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది.
Honor 200 5G Features – ఇండియాలో హానర్ మొబైల్ కు స్పెషల్ డిమాండ్ ఉందనే చెప్పాలి. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎప్పటికప్పుడు గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ మొబైల్స్ ను తీసుకొచ్చేస్తుంది. ఈ ఏడాది జులైలో హానర్ 200 5G మొబైల్ సిరీస్ ను లాంఛ్ చేసింది. ఈ సిరీస్ లో భాగంగా హానర్ 200 5G, హానర్ 200 ప్రో 5G మొబైల్స్ ఇండియా మార్కెట్లోకి వచ్చేసాయి. ఇక ఈ రెండు మొబైల్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ సైతం ఆ సంస్థ జోడించింది.
Honor 200 5G లో డిస్ ప్లే అదిరేలా ఉంది. 6.7 అంగుళాల FHD + OLED 120Hz కర్వ్డ్ డిస్‌ప్లేతో 4000 nits గరిష్ట ప్రకాశంతో వచ్చేసింది. ఇందులో Adreno 720 GPUతో Qualcomm Snapdragon 7 Gen 3తో డిజైన్ చేయబడింది. ఇది గరిష్టంగా 16GB LPDDR5 RAM + 512GB వరకు స్టోరేజ్ తో వచ్చేసింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5200mAh బ్యాటరీతో వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ షూటర్‌తో పాటు 12MP అల్ట్రావైడ్ కెమెరాతో వచ్చేసింది. ఇక 50MP 2.5x పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో సోనీ IMX856 సెన్సార్‌తో వచ్చేసింది. సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో లాంఛ్ అయింది. ఇందులో కనెక్టివిటీ సైతం అదిరిపోయేలా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ax, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్ C పోర్టల్ ఉన్నాయి.
ఇక ఈ మెుబైల్ లో కొత్త ఫేస్ టు ఫేస్ ట్రాన్స్‌లేషన్ ఏఐ ఫీచర్ ను జోడించారు. దీంతో పలు రకాల భాషల్లో వాయిస్, టెక్స్ట్ కమాండ్ ఆధారంగా రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ అందిస్తాయి. ఈ MR2 అప్డేట్ లో యుఎస్‌బి కనెక్టివిటీకి సెక్యూరిటీ ఎన్‌హాన్స్‌మెంట్స్ చేశారు. దీంతో ఫోన్ ను ల్యాప్ టాప్ లేదా ఇతర డివైస్ కు కనెక్ట్ చేసినప్పుడు యూజర్ అథెంటికేషన్ అడుగుతుంది. ఈ ఫీచర్ తో ల్యాప్ టాప్ లేదా పీసీతో కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేయాలన్నా, డేటా ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా సెక్యూరిటీకి యూజర్ అథెంటికేషన్ చేయాల్సిందే.
ALSO READ : రేపటి నుంచే వాట్సాప్ సేవలు బంద్.. మీరూ కావొచ్చు బాధితులు!