WhatsApp : ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఉండే ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెటా తీసుకొచ్చిన ఈ యాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వినియోగదారుల భద్రతను మరింత పెంచే దిశగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ సంస్థ.. కొన్ని డివైజెస్ లో జనవరి 1 నుంచే వాట్సాప్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp 2025 నుండి పాత Android పరికరాలకు మద్దతును నిలిపివేయాలని నిర్ణయించుకుంది. జనవరి 1 నుండి Android KitKat లేదా పాత వెర్షన్‌లు నడుస్తున్న Android ఫోన్‌లలో ఈ యాప్ పని చేయదు. కొత్త మార్పులతో పాత Android మోడల్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులు వాట్సాప్ ను ఉపయోగించడానికి ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ తన Android డివైజస్ కు ఎందుకు మద్దతును నిలిపివేస్తోందంటే.. పాత డివైజస్ లో హార్డ్‌వేర్ యాప్ లో వచ్చే కొత్త ఫీచర్‌లకు ఆ సిస్టమ్స్ మద్దతు ఇవ్వదు. అయితే వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో మెటా AIకి మద్దతు ఇచ్చి ఎన్నో ఫీచర్లతో AI అప్డేట్స్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతో వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏ డివైజెస్ లో వాట్సాప్ పనిచేయదంటే – వాట్సాప్ పని చేయని జాబితాలో Samsung, Motorola, LG, Sony వంటి ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటిలో కొన్ని డివైజెస్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
Samsung Galaxy S3
Samsung Galaxy Note 2, Samsung Galaxy S4 Mini
Motorola Moto G (1వ తరం)
మోటరోలా రేజర్ HD
Samsung Galaxy S3,
మోటరోలా మోటో జి,
HTC One X
Sony Xperia Z.
LG L90
Sony Xperia Z
సోనీ ఎక్స్‌పీరియా SP
సోనీ ఎక్స్‌పీరియా
Moto E 2014
HTC One X
HTC One X+
HTCDesire 500
HTCDesire 601
LG ఆప్టిమస్ జి
LG Nexus 4
LG G2 మినీ
ఇంకా వాట్సాప్ iOS 15.1 లేదా పాత వెర్షన్‌లను నడుపుతున్న ఐఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్ ఉండదు. దీంతో iPhone 5s, iPhone 6, iPhone 6 Plusలలో వాట్సాప్ పనిచేయదు. అయితే, iPhone వినియోగదారులు కొత్త డివైజెస్ కు మారడానికి మే 5, 2025 వరకూ మెటా టైమ్ ఇచ్చింది. ఇక మే 5, 2025 తర్వాత WhatsApp iOS వెర్షన్‌కు మద్దతు ఇవ్వడం ఆపివేస్తుందని కొద్ది రోజుల క్రితమే మెటా వినియోగదారులకు నోటిఫికేషన్స్ పంపింది. అయితే WhatsApp iOS 12 తో పాటు ఆ తదుపరి మోడల్స్ కు సపోర్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. iOS 15.1 లేదా లేటెస్ట్ అప్డేట్స్ కు సపోర్ట్ చేయనుంది.
ఇక గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో వాట్సాప్ వినియోగదారులకు చేరువకానుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్స్ కు సపోర్ట్ చేసే డివైసెస్ లో మాత్రమే వాట్సప్ పనిచేసే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన అన్ని డివైసెస్ లో వాట్సాప్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే పాత డివైసెస్ వాడుతున్న వినియోగదారులు కచ్చితంగా తమ సిస్టమ్ లో అప్డేట్ చేసుకోవడం అత్యవసరం.
ALSO READ : బెంబేలెత్తిస్తున్న టెంపుల్ హోటల్ స్కామ్స్ – అడ్డంగా ఇరుక్కుపోయిన వృద్ధుడు