South Central Railway: మీరు నిరంతరం రైలులో ప్రయాణిస్తుంటారా.. అయితే మీకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. జనవరి 1, 2025 నుండి తీసుకోబోతున్న కీలక నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని గమనించకపోతే మాత్రం రైలు ప్రయాణానికి మీరు దూరం కాక తప్పదు. ఈ మార్పుల వివరాలను రైల్వే స్టేషన్స్ వద్ద ప్రదర్శించినట్లు, ప్రయాణికులు గమనించాలని కూడా కోరింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రయాణికుల కోసం ఓ ప్రకటన వెలువడింది. రైళ్ల సమయాల్లో జనవరి1, 2025 నుండి అమల్లోకి వస్తుందని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. అందుకై జనవరి 1 నుండి ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, రైళ్ల సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.
రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో సమయాల్లో మార్పులను ఐ.ఆర్.సి.టి.సి వెబ్‌సైట్ (www.irctc.co.in)ను కానీ , నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్.టి.ఈ.ఎస్)ను సందర్శించాలని ప్రకటించింది. అంతేకాకుండ నేరుగా సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించి సరైన సమయాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సహకరించాలని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.
Also Read: TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన
ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లోనూ మార్పులు..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు కూడ జనవరి 1 నుండి అమలులోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. తమ పరిధిలో మొత్తం 88 ఎంఎంటీఎస్ సర్వీసుల ద్వార సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ కొత్త సబర్బన్ విభాగం – మేడ్చల్, ఫలక్‌నుమా – ఉమ్దానగర్, ఘట్కేసర్ – లింగంపల్లి ఎంఎంటీఎస్ రైళ్ల సమయాల్లో మార్పులు జరిగాయి. ప్రయాణికుల సమయాలను దృష్టిలో ఉంచుకుని, రైళ్ల వేళలు మార్చినట్లు ప్రయాణికులకు సూచించింది. మారిన సమయాన్ని తెలుపుతూ.. వివిధ స్టేషన్లలో మార్పుల వివరాలను ప్రదర్శించడం జరిగిందని, ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.