Honor 200 Pro Launched: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. హానర్ తన సక్సెస్ ఫుల్ సిరీస్ హానర్ 200ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా త్వరలో Honor 200 Pro మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో కంపెనీ ఇప్పటికే హానర్ 200 లైట్‌ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ సిరీస్ హానర్ 100 తర్వాత జనరేషన్ స్మార్ట్‌ఫోన్. ఇప్పుడు దాని హానర్ 200 ప్రో చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఈ సిరీస్‌లోని అత్యంత అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో రాబోతున్న హానర్ 200 సిరీస్‌లో ఇది టాప్ మోడల్. ఓవరాల్‌గా ఫోన్ కెమెరా ఐలాండ్ ఫోన్‌లా కనిపిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్లు, తదితర అన్ని వివరాల గురించి తెలుసుకుందాం.
హానర్ 200 ప్రో రెండర్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఫోన్‌లో ప్రత్యేకమైన డిజైన్ కనిపిస్తుంది. ఈ రెండర్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వైరల్‌గా మరాయి. ఓ గుర్తుతెలియని అకౌంట్ నుంచి బయటకు వచ్చాయి. ఫోన్ మెయిన ఓవల్ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. గ్లాస్, ఫాక్స్ లెదర్ కలర్స్‌తో ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ టోన్ కనిపిస్తుంది. కెమెరా ఐలాండ్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి.
Also Read: 50MP కెమెరాతో వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్.. త్వరలో లాంచ్!
హానర్ 200 ప్రో మూడు కెమెరాలలో 50X డిజిటల్ జూమ్‌ను కలిగి ఉండే పెరిస్కోప్ లెన్స్ కూడా ఉన్నాయి. ప్రధాన సెన్సార్ 50 మెగాపిక్సెల్‌లను కలిగి ఉంది. ఇది f/1.9 నుండి f/2.4 వరకు వేరియబుల్ ఎపర్చరును కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉన్నట్లు తెలిసింది. అయితే Snapdragon 8s Gen 3ని సిరీస్ వనిల్లా మోడల్ అంటే Honor 200లో చూడవచ్చు. 1.5K రిజల్యూషన్‌తో కూడిన OLED డిస్‌ప్లేను ఫోన్‌లో చూడవచ్చు.
Also Read: జియో బంపరాఫర్.. Netflix, Amazonతో పాటు 15 OTTల సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
హానర్ 200 ప్రో ప్రత్యేక ఫీచర్‌లో ఫోన్ ఫ్రంట్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరాను తీసుకొచ్చారు. ఈ రెండు కెమెరాలు పిల్ ఆకారపు కటౌట్‌లలో ఉంటాయి. Honor 200, 200 Pro 3C సర్టిఫికేషన్ ప్రకారం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్లు రావొచ్చు. రెండు మోడళ్లలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ చూడవచ్చు. మే నెలాఖరులో కంపెనీ ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది. భారత్‌లో మార్కెట్‌లోనూ ఈ ఫోన్ చూడొచ్చు.