BigTV English

Rush in Bus Stops: బండెనక.. బండికట్టి.. ఓట్ల పండక్కి పయనం!

Rush in Bus Stops: బండెనక.. బండికట్టి.. ఓట్ల పండక్కి పయనం!

ఎలక్షన్ కమిషన్‌ ప్రతి ఏటా నెత్తి నోరు కొట్టుకొని ప్రచారం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. కానీ ఏ ఒక్కసారి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ జరగలేదు. కనీసం 90 పర్సెంట్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు ఓటింగ్ పర్సెంటేజ్.. ఏపీ పోలింగ్ డేటాను చూస్తే.. 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు 74.64 శాతం.. అదే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఈ పర్సంటేజ్ పెరిగింది. గత ఎన్నికల్లో ఏకంగా 79.74 శాతం ఓటింగ్ నమోదైంది.

బట్.. ఈసారి ఈ రికార్డులన్ని తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మొన్న ఏపీలో జరిగిన పోస్టల్ బ్యాలేట్ ఓటింగ్‌నే చూడండి.. ఏకంగా 4 లక్షల 30 వేల మంది మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడూ కూడా ఈరేంజ్‌లో ఓట్లు పడలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 2 లక్షల మందికి పైగానే ఓట్లు వేశారు ఉద్యోగులు. కానీ ఈసారి ఈ నంబర్ దాదాపు డబులైంది. ఇదే రికార్డ్ అనుకుంటే.. సాధారణ ఓటర్ల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ పోలింగ్‌ కూడా జోరుగానే కొనసాగేలా ఉంది.


Also Read: చూడరయా.. ఎన్నికల సిత్రాలు!

ప్రస్తుతం సొంత ఊళ్లని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లకి ఫోన్లు వెళ్లాయి. ఎలాగైనా ఊర్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు వివిధ పార్టీల అభ్యర్థులు.. వారి అనుచరులు. ట్రాన్స్‌పోర్ట్‌కు ఏవైనా ఇబ్బందులు ఉంటే.. తామే అరెంజ్‌ చేస్తామని హామీలు కూడా ఇస్తున్నారు. ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో కొందరు. ప్రలోభాలకు లొంగి మరికొందరు. మొత్తానికే ప్రస్తుతం ఏపీ బాట పట్టారు. శుక్రవారం రాత్రి నుంచే హైదరాబాద్‌ ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగింది. భారీగా కార్ల క్యూ కనిపిస్తుంది. వేసవిలో సంక్రాంతి వైబ్స్‌ కనిపిస్తున్నాయంటే నమ్మండి.

ఈసారి ఏపీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ అవుతుందని అంచనా వేస్తోంది ఎలక్షన్ కమిషన్.. అంతేకాదు దీన్ని టార్గెట్‌గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో రూరల్ ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ప్రాంతాల్లోనే పోలింగ్ తక్కువగా జరుగుతుంది. వారందరిని పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతుంది. గతంలో ఇదే టార్గెట్‌తో పనిచేసింది ఈసీ.. కానీ రీచ్‌ కాలేకపోయింది. కానీ ఈసారి ఈజీగా ఈ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: KA Paul vote in Visakhapatnam: 9 గంటలకు పోలింగ్.. ఓటు వేసిన కేఏపాల్, సంచలన వ్యాఖ్యలు

ఇందులో ఈసీ శ్రమ కంటే.. ప్రధాన పార్టీల కృషే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరిని సొంత ప్రాంతాలకు రప్పించడం. ఊళ్లలో ఉన్న ప్రతి ఒక్కరితో ఓటు వేయించడం కోసం వాళ్లు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరి ఈ రేంజ్‌లో జరగబోయే పోలింగ్ ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి చేటు చేస్తుంది? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్.. మాములుగా పోలింగ్ పెరిగితే అటు అధికార, ఇటు విపక్ష పార్టీలకు టెన్షన్ పెరుగుతుంది. ఇది తమపై ఉన్న అభిమానంతో వేసిన ఓట్లా.. లేక వ్యతిరేకతతో వేసిన ఓట్లా? అనేది తేల్చుకోలేని సిట్యూవేషన్‌లో ఉంటారు. ఇక విపక్షానికి మరో బాధ. అధికార పార్టీ వారందరిని రప్పించిందా? లేక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగానే వచ్చి ఓటేశారా? ఇది విపక్ష నేతల బాధ.

మొత్తానికైతే హైదరాబాద్‌ ఖాళీ అయ్యింది. తట్టా, బుట్టా, పిల్లా, జెల్లా అందరితో కలిసి అందరూ ఏపీకి తరలి వెళ్లారు. ఇప్పుడు వీరంతా ఏపీలోని ప్రధాన పార్టీల తలరాతలను మార్చేందుకు రెడీ అయ్యారు. అయితే వీరంతా ఎవరి వైపు ఉన్నారన్నది మాత్రం జూన్‌ 4న తేలనుంది.

Also Read: Balakrishna, pawankalyan family vote: మంగళగిరిలో పవన్, హిందూపురంలో బాలయ్య దంపతులు..

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×