Honor Play 60 Series: చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మరోసారి తన యూత్ సిరీస్‌ను ముందుకు తీసుకొచ్చింది. హానర్ ప్లే 60ప్లే 60m పేరుతో రెండు కొత్త మోడళ్లను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్లు యూత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. స్టైల్, పనితీరు, బ్యాటరీ లైఫ్ అన్నీ కూడా భారీగా ఉండటం విశేషం. మిడ్-రేంజ్ కేటగిరీలో ఈ ఫోన్లు మరింత పోటీనిచ్చేలా ఉన్నాయి. ఈ క్రమంలో హానర్ ప్లే 60 సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర విషయాలను ఇప్పుడు చూద్దాం.
డిజైన్ అండ్ డిస్ప్లే
హానర్ ప్లే 60, ప్లే 60m ఫోన్లు 6.61 అంగుళాల TFT LCD డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే 1604 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందించడంతో పాటు, 1010 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అంటే ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. స్క్రీన్ కంటి రక్షణ కోసం ‘న్యాచురల్ లైట్ వీక్షణ మోడ్’, ‘ఐ ప్రొటెక్షన్ మోడ్’ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల డిజైన్ లోనూ ఒక ప్రత్యేకత ఉంది. మెటాలిక్ ఫినిష్, మినిమలిస్ట్ కెమెరా మాడ్యూల్, మూడు రంగులలో అందుబాటులో ఉండటం. యూత్‌కు ఎంతగానో నచ్చేలా ఉన్నాయి.
ప్రాసెసింగ్ పవర్
డైమెన్సిటీ 6300 చిప్‌తో శక్తివంతమైన పనితీరును ఇస్తుంది. హానర్ ప్లే 60 సిరీస్ ఫోన్లు కొత్తగా వచ్చిన MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్, ARM G57 MC2 GPUతో లభిస్తుంది. డైలీ యూజ్, మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అనేక పనులకు ఇది తక్కువ బడ్జెట్‌లో మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్లు Android 9 ఆధారిత MagicOS 15 పై పనిచేస్తాయి. అద్భుతమైన UI అనుభవాన్ని అందించే MagicOSలో ఫీచర్లు మెరుగయ్యాయి.
రెండు రోజుల వరకు నో ఛార్జ్
ఒక మంచి మిడ్-రేంజ్ ఫోన్‌లో కావలసిన ముఖ్యమైన లక్షణం బ్యాటరీ. హానర్ ప్లే 60 సిరీస్ 6000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇది సాధారణ యూజ్‌లో రెండు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుంది. 5V/3A వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉండటంతో వేగంగా ఛార్జ్ అవుతుంది. అలాగే స్మార్ట్ ఛార్జింగ్ మోడ్ కూడా కలిగి ఉండటం విశేషం.
Read Also: Smartwatch Offer: బడ్జెట్ ధరల్లో ఫాస్ట్రాక్ ప్రీమియం
కెమెరా సెటప్
హానర్ ప్లే 60, ప్లే 60m ఫోన్లలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, ఇది f/1.8 ఎపర్చర్‌తో వస్తుంది. 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో కలిపి సాధారణ ఫోటోగ్రఫీకి చక్కగా ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం f/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా మోడ్‌లలో నైట్ మోడ్, HDR, టైమ్ లాప్స్, డ్యూయల్ వ్యూ వీడియో, స్మైల్ క్యాప్చర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
మెమరీ వేరియంట్లు – మీకు అవసరమైన స్టోరేజ్‌ను ఎంచుకోండి
హానర్ ప్లే 60:
-6GB RAM + 128GB స్టోరేజ్ – ¥1,199 (దాదాపు రూ.14,023)
-8GB RAM + 256GB స్టోరేజ్ – ¥1,399 (దాదాపు రూ.16,362)
హానర్ ప్లే 60m:
-6GB RAM + 128GB స్టోరేజ్ – ¥1,699 (దాదాపు రూ.19,871)
-8GB RAM + 256GB స్టోరేజ్ – ¥2,199 (దాదాపు రూ.25,719)
-12GB RAM + 256GB స్టోరేజ్ – ¥2,599 (దాదాపు రూ.30,397)
-ఈ ధరలు చైనాలో లభ్యమయ్యే ధరలు, భారత్‌లో లాంచ్ అయితే ఇవి మారవచ్చు.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఈ ఫోన్లలో 5G సపోర్ట్‌తో పాటు డ్యూయల్ సిమ్, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్, OTG, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఎంపికలు ఉన్నాయి. భద్రత పరంగా ఫేస్ అన్‌లాక్, యాప్ లాక్, AI ఫేస్ డిటెక్షన్, పేమెంట్ ప్రొటెక్షన్ వంటి లక్షణాలు కలిగి ఉన్నాయి.
దుమ్ము, నీటి నుంచి రక్షణ
హానర్ ప్లే 60 సిరీస్ IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే దుమ్ము, నీటి స్ప్లాష్‌ల నుంచి ఫోన్‌ను రక్షించగలదు. ఇది రోజువారీ వాడకానికి బాగా సరిపోతుంది. హానర్ గతంలో కూడా చైనాలో లాంచ్ చేసిన కొన్ని మోడళ్లను కొద్ది రోజుల తర్వాత ఇండియాలోకి తీసుకొచ్చింది.