Megastar Chiranjeevi: ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఎప్పుడో విడిపోయిన ఫ్రెండ్స్ కలవడానికి, అలానే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలకు, కొన్ని ఎచీవ్మెంట్స్ షేర్ చేసుకోవడానికి, ఇలా చాలా విషయాలకు ఉపయోగపడేది. అలానే రీసెంట్ టైమ్స్ లో కూడా సోషల్ మీడియా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లకు బాగానే ఉపయోగపడింది. కొంతమందికి ఏకంగా సినిమా అవకాశాలను తీసుకొచ్చింది. ఒకప్పుడు సినిమాల్లో అవకాశం రావడం అనేది అరుదైన విషయం. కానీ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని తమ కెరియర్ని సెట్ చేసుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే ప్రతి విషయంలో మంచి చెడు రెండు ఉన్నట్లు సోషల్ మీడియా వల్ల కూడా మంచి చెడు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా వలన ఎన్నో సంఘటనలు కూడా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాన్ వార్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని డిబేట్స్ తో మొదలై ఫ్యామిలీ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేంత రేంజ్ కి కూడా వెళ్లిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి.
ట్రోలింగ్ కోసమే
ఇక నిత్యం ఎవరో ఒకరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పాటు ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే కొంతమంది తమ ఒరిజినల్ అకౌంట్స్ తో కాకుండా కొన్ని ఫేక్ అకౌంట్స్ ను కేవలం ట్రోలింగ్ కోసమే క్రియేట్ చేస్తారు అని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరుగుతాయి. కొన్ని ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ కూడా విడుదల చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య రీసెంట్గా జరిగిన మ్యాచ్ కి చాలామంది సెలబ్రిటీలు హాజరైన విషయం తెలిసిందే. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తో క్రికెటర్స్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలైన సంగతి తెలిసింది. ఈ సీజన్లో వీళ్ళిద్దరూ ఆట తీరు కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే దీన్ని అనుకోవగా తీసుకొని కొంతమంది చిరంజీవిని కలిసి ఫోటో దిగిన తర్వాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అన్ని రోజులు మనవి కాదు
ఇక క్రికెట్ విషయానికి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఒక బాల్ తో మ్యాచ్ డిసైడ్ అయిపోతుంది. అలానే చాలామంది అన్ని రోజులు అన్నిసార్లు ఒకేలా ఆడాలని కూడా లేదు. కొన్నిసార్లు బాగా ఆట ఆడిన ప్లేయర్స్ మరికొన్నిసార్లు డకౌంటుతో పెవిలియన్ చేరుతుంటారు. అది పూర్తిగా అప్పుడు ఆటలో ఉన్న పరిస్థితుల వలన కూడా ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక వ్యక్తిని బ్లైమ్ చేసి కామెంట్ చేయడం అనేది పూర్తిగా పర్సనల్ టార్గెట్ అని చెప్పాలి. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది అభిమానులు ఉన్నారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి స్థానం ఉన్నాయి. పదేళ్లపాటు మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ ఇచ్చినా కూడా రీఎంట్రీ తో ఆయన రీ సౌండ్ అదిరిపోయింది. ఏదేమైనా కొన్నిసార్లు పోస్టులు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి పెట్టడం కూడా మంచి పద్ధతి.
Also Read : Trivikram: ఎన్టీఆర్ స్పీచ్ ఇస్తే త్రివిక్రమ్ స్పీచ్ తప్పించుకుంటారా.?