ChatGPT : చాట్ జీపీటీ.. ఈ ఒక్క పదం టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెన్‌ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్‌జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా చాట్‌బాట్ క్షణాల్లో ఇచ్చేస్తుంది. యూజర్లకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చిన ఈ ఫ్లాట్ఫామ్.. రోజు రోజుకు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ను తీసుకొస్తుంది. దీంతో చాట్ జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న చాట్‌జీపీటీ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
ChatGPT వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇకపై వినియోగదారులు తమ రిమైండర్‌లను షెడ్యూల్ చేయమని AI చాట్‌బాట్‌ని అడగవచ్చు. ఈ ఫీచర్ టాస్క్‌ల టూల్ కింద పనిచేసే ఛాన్స్ ఉందని.. ప్రస్తుతం బీటా దశలో ఉందని తెలుస్తుంది. ఈ ఫీచర్ లో మరిన్ని అప్డేట్స్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ… ప్రస్తుతం సాధారణ రిమైండర్‌లు, అలారాలు, ఇతర ముఖ్యమైన విషయాలను సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది.
చాట్ జీపీటీలో షెడ్యూల్ చేయడానికి టాస్క్‌లకు కూడా పరిమితి ఉంది. ఒకేసారి 10 టాస్క్‌లను మాత్రమే షెడ్యూల్ చేయగలిగే ఛాన్స్ ఉంది. ఇక ఒకసారి టాస్క్ సెట్ చేశాక వాటిని సవరించవచ్చు, తొలగించవచ్చు రద్దు చేయవచ్చు.
ఫీచర్ ఎలా పని చేస్తుంది? –
చాట్ జీపీటీలో ఉన్న ఈ ఫీచర్ రెగ్యూలర్ లేదా ఇంపార్టెంట్ రిమైండర్‌లను సెట్ చేయడానికి అనుమతిస్తుంది. అంటే ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినప్పుడు గుర్తు చేయమని AI చాట్‌బాట్‌ని అడగవచ్చు లేదా పెంపుడు జంతువులకు ఏ టైమ్ లో ఆహారం ఇవ్వాలో గుర్తు చేయమని కూడా అడగొచ్చు. రిమైండర్‌ని షెడ్యూల్ చేయమని అడిగిన తర్వాత, ChatGPT పుష్ నోటిఫికేషన్‌తో ఫాలో అప్ చేస్తుంది. ఆపై టాస్క్ ఎనేబుల్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లలో టాస్క్ చేయమని నోటిఫికేషన్ గుర్తు చేస్తుంది.
ప్లస్, టీమ్, ప్రో సబ్‌స్క్రైబర్‌లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఇది షెడ్యూల్ చేసిన టాస్క్‌లతో అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తుంది. ఈ ఫీచర్ Google అసిస్టెంట్, సిరి వంటి ఇతర డిజిటల్ అసిస్టెంట్‌ల వలె పని చేస్తుంది. అయితే ఇది మరింత సమర్థవంతమైన మార్గంలో, మరింత అధునాతన భాషా సామర్థ్యాలతో పని చేస్తుంది.
ఈ ఫీచర్ ను ఉపయోగించినప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే… చేసే పనుల విషయంపై షెడ్యూల్ ఇవ్వమని.. ఆ పనులు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో తెలుపుతూ రిమైండర్‌ను సెట్ చేయమని ChatGPTని అడగండి. ఆపై చాట్ జీపీటీ ఆ పనిని సమర్ధవంతంగా సృష్టిస్తుంది. మీరు షెడ్యూల్ చేసిన టాస్క్‌లను నిర్వహించడానికి కంపెనీ ప్రొఫైల్ మెనులో ప్రత్యేక విభాగాన్ని జోడిస్తుంది. అదనంగా, AI చాట్‌బాట్ మీ చాట్‌ల ఆధారంగా టాస్క్‌లను కూడా సూచిస్తుంది. అయితే చాట్ జీపీటీలో షెడ్యూల్ చేయడానికి టాస్క్‌లకు కూడా పరిమితి ఉంది. ఎవరైనా ఒకేసారి 10 టాస్క్‌లను మాత్రమే షెడ్యూల్ చేయగలరనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.
ALSO READ : హ్యూమన్ కంప్యూటింగ్ లో మరో మైలురాయి