Elon Musk’s Neuralink : ఎలాన్ మస్క్ న్యూరాలింక్ తన ప్రాజెక్ట్‌లో మరో మైలురాయిని సాధించింది. ఈ కంపెనీ తన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) పరికరాన్ని థర్డ్ ఫేషెంట్ కు విజయవంతంగా అమర్చింది. లాస్ వెగాస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తాజాగా మరో ఘనతను సాధించారు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) పరికరాన్ని థర్డ్ ఫేషెంట్ కు విజయవంతంగా అమర్చి రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించాడు. దానికి తోడు 2025లో ఈ కంపెనీ మరో 20 నుండి 30 ఇంప్లాంట్‌ల కోసం ప్లాన్ చేస్తుందని కూడా ప్రకటించాడు. అదే విషయాన్ని చెబుతూ, ” ఇప్పుడు న్యూరాలింక్‌లు అమర్చిన ముగ్గురు మనుషులను మనం చూడొచ్చు. ఇంకా వారంతా బాగా పని చేస్తున్నారు” అని తెలిపారు.
నిజానికి ఈ న్యూరాలింక్ చిప్ నాణెం పరిమాణంలో ఉంటుంది. శస్త్రచికిత్స తో పేషెంట్ బ్రెయిన్ లో అమరుస్తారు. ఇది ఎలాంటి ఆటంకాలు లేని BCIని సృష్టించడానికి మెదడులోకి విస్తరించి ఉన్న అతి సన్నని వైర్‌లను కలిగి ఉంది. ఈ కంపెనీ తెలిపిన సమాచారం ప్రకారం.. ఇంప్లాంట్ కనిపించదు. కంప్యూటర్‌లు లేదా మొబైల్ గ్యాడ్డెట్స్ ను నియంత్రించడానికి వినియోగదారులను అనుమతించేలా ఇది రూపొందించబడింది. ఇది కొత్త ఇండిపెండెంట్, బెటర్మెంట్ తో ప్రత్యేక సామర్థ్యం ఉన్నవారికి సహాయం చేస్తుంది. ఇది విజయవంతమైతే, పక్షవాతం, ALS వంటి పరిస్థితులతో వ్యవహరించే రోగులకు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.
మొదటి న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాంట్ జనవరి 2024లో జరిగింది. అప్పటి నుండి, న్యూరాలింక్ దాని గ్యాడ్జెట్స్ ను మరిన్ని ఎలక్ట్రోడ్‌లు, మెరుగైన బ్యాండ్‌విడ్త్ తో అప్‌గ్రేడ్ చేసింది. చిప్‌ను పొందిన మొదటి పేషెంట్ నోలాండ్ అర్బాగ్. అతను ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడానికి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి, తన ఆలోచనలను మాత్రమే ఉపయోగించి వీడియో గేమ్‌లు ఆడటానికి ఈ చిప్ ను ఉపయోగించాడు. అర్బాగ్, గతంలో ఒక టాబ్లెట్‌ను ఆపరేట్ చేయడానికి మౌత్ స్టిక్‌పై ఆధారపడేవాడు. కానీ చిప్ అమర్చాక ఈ పరిస్థితి మారిందని స్వయంగా తెలిపాడు.
ప్రస్తుతం, మూడవ పేషెంట్ గురించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఈ కంపెనీ ప్రస్తుతం హ్యూమన్ పరీక్షలో భాగంగా ఎక్కువ మంది రోగులకు చిప్‌ను అమర్చడంపై దృష్టి సారిస్తోంది. ఇది విజయవంతమైతే, మస్క్ న్యూరాలింక్ సాంకేతికత మరింతగా విస్తరిస్తుంది. హ్యూమన్ కంప్యూటర్లో మరో మైలురాయి చేరుతుంది.
ALSO READ : కోడింగ్ రాస్తున్న AI.. ఐటీ ఉద్యోగాలపై వేలాడుతున్న లేఆఫ్ కత్తి..