Maha Kumbh Mela 2025: జనవరి 13 మకర సంక్రాంతి నుండి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా ప్రారంభమయింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది కుంభమేళా అయితే 144 సంవత్సరాల తర్వాత నిర్వహించబడేది మహాకుంభ మేళా.
ప్రతి కుటుంబంలోని మూడవ తరానికి మహాకుంభాన్ని చూసే అవకాశం లభిస్తుంది. మహా కుంభమేళాను చూడటం అదృష్టం. ఇదిలా ఉంటే మహా కుంభమేళా 2025కి మతపరమైన, ఆధ్యాత్మిక మాత్రమే కాకుండా శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది.
మహాకుంభమేళా యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహాకుంభమేళా యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యత:
మహాకుంభామేళాకు మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది. దేవతలు, రాక్షసుల మధ్య సముద్ర మథనం నుండి అమృత కలశం బయటకు వచ్చిందని పురాణాల్లో చెప్పబడింది. ఆ దివ్యమైన కలశాన్ని పొందడానికి, దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగిందట. అదే సమయంలో అమృతం యొక్క నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి.అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని , నాసిక్ ప్రదేశాలని చెబుతారు.
పురాణాల ప్రకారం దేవతలకు 12 రోజులు అంటే భూమిపై 12 సంవత్సరాలు అని పురాణాల్లో చెప్పడింది. సూర్యుడు, భూమి, చంద్రుడు, బృహస్పతి అనే నాలుగు గ్రహాలు ఒక నిర్దిష్ట కలయికలో వచ్చినప్పుడు జనవరి 3న సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీంతో పాటు, సూర్య ఉత్తరాయణం మకర సంక్రాంతి 14 న సంభవిస్తుంది. అంతే కాకుండా పౌర్ణమి రోజున బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు.
సూర్యుడు ప్రతి 12 సంవత్సరాలకు సౌర చక్రాన్ని పూర్తి చేస్తాడు. సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణ ధృవం వైపు తిరిగినప్పుడు సూర్యుని అయస్కాంత క్షేత్రం వల్ల భూమి యొక్క వాతావరణం ప్రభావితమవుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం భూమిపై నివసించే జంతువులు, మానవులకు అత్యంత సానుకూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
సూర్య చక్ర సమయం కూడా కుంభ రాశికి సంబంధించింది. చలి కాలంలో వాతావరణంలో ఆక్సిజన్ అణువుల సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాతావరణంతో పాటు నీటిలో ఆక్సిజన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈ శాస్త్రీయ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఋషులు కుంభమేళా సంప్రదాయాన్ని అభివృద్ధి చేశారని భావించవచ్చు.
Also Read: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !
బృహస్పతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి, సూర్యుని సౌర చక్రం , ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం మార్పు సమయంలో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఇది భూమిపై సానుకూల శక్తి సుమోన్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ద్వారా మానవ మెదడులోని ఆల్ఫా కిరణాలను పెంచుతుంది. దీనివల్ల మనిషి మనసుకు ప్రశాంతతతోపాటు శరీరానికి ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుంది. సూర్యుడి కార్యకలాపాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా భూమిపై ఉండే మానవులు కూడా ప్రభావితం అవుతారు. అద్భుత ప్రయోజనాల కోసమే కుంభమేళాను నిర్వహిస్తారు. ఇది శాస్త్రీయపరమైన ప్రాముఖ్యత. దీనికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ఏదేమైనా కుంభమేళా ఒక అద్భుతమైన హిందూ సంస్కృతి , సాంప్రదాయాలకు ప్రతిబింబంలాగా నిలుస్తోంది.