E-Paper
Advertisement

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!

ఫోన్‌లో సిగ్నల్ సరిగ్గా రావడం లేదా? సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో నెట్‌వర్క్ ఫుల్!
Advertisement

Mobile Network: మనం ఇప్పుడు 6G టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, ఇంకా చాలా ప్రాంతాల్లో కనీసం 5G సిగ్నల్స్ కూడా సరిగ్గా అందడం లేదు. ఫోన్ మాట్లాడుతుంటే మధ్యలోనే కాల్ కట్ అవ్వడం, అవతలి వాళ్ల మాటలు సరిగ్గా వినిపించకపోవడం, ఇంటర్నెట్ స్లోగా రావడం వంటి సమస్యలు మనల్ని రోజువారీ జీవితంలో ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ప్రతిసారీ నెట్‌వర్క్ కంపెనీలదే తప్పు అనుకోకూడదు. కొన్నిసార్లు మన ఫోన్ సెట్టింగ్స్‌లో లేదా మనం ఉండే ప్రదేశం వల్ల కూడా సిగ్నల్ వీక్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని సింపుల్ చిట్కాలతో వెంటనే ఫోన్ సిగ్నల్‌ను మెరుగ్గా పొందవచ్చు.

ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం:

మీ ఫోన్‌లో సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయండి. ఒక 10 – 15 సెకన్ల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ పాత నెట్‌వర్క్ కనెక్షన్‌ను కట్ చేసుకుని, దగ్గరలో ఉన్న టవర్‌కు మళ్లీ కొత్తగా కనెక్ట్ అవుతుంది. ఈ చిన్న ట్రిక్‌తో చాలాసార్లు సిగ్నల్ సమస్య క్షణాల్లో పరిష్కారమవుతుంది. ఒకవేళ దీనివల్ల పని కాకపోతే.. మీ ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేసి చూడండి. రీస్టార్ట్ చేయడం వల్ల ఫోన్‌లోని చిన్నచిన్న సాఫ్ట్‌వేర్ లోపాలు తొలగిపోయి, నెట్‌వర్క్ వేగం పుంజుకుంటుంది.

సరైన నెట్‌వర్క్ మోడ్ ఎంచుకోవడం:

Advertisement

చాలామంది ఫోన్‌లలో నెట్‌వర్క్ మోడ్ ఎప్పుడూ ఆటోమేటిక్ లేదా 5G లోనే ఉంటుంది. కానీ మీరు ఉన్న ప్రాంతంలో 5G సిగ్నల్స్ బలహీనంగా ఉంటే.. ఫోన్ ఆ సిగ్నల్ కోసం వెతుకుతూ కాల్స్ కట్ అయ్యేలా చేస్తుంది. అలాంటప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ మోడ్‌ను 4G కి మార్చుకోండి. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ స్థిరంగా ఉండటమే కాకుండా, వాయిస్ కాల్స్ కూడా ఎటువంటి అంతరాయం లేకుండా స్పష్టంగా వినిపిస్తాయి.

Also Read: రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

సిమ్ కార్డును క్లీన్ చేయడం:

Advertisement

మనం ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ పెడుతుంటాం కాబట్టి.. లోపల ఉండే సిమ్ కార్డుపై దుమ్ము లేదా తేమ చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా సిగ్నల్స్ సరిగ్గా అందవు. కాబట్టి ముందుగా మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, సిమ్ ట్రే బయటకు తీయండి. ఒక మెత్తని పొడి బట్టతో సిమ్ కార్డుపై ఉండే బంగారు రంగు చిప్‌ను సున్నితంగా తుడవండి. ఆ తర్వాత మళ్లీ సిమ్ వేసి ఫోన్ ఆన్ చేస్తే సిగ్నల్ క్వాలిటీ కచ్చితంగా పెరుగుతుంది.

ప్రదేశాన్ని బట్టి సిగ్నల్స్:

పెద్దపెద్ద బిల్డింగ్‌ల లోపల, బేస్‌మెంట్లలో, లిఫ్టులలో లేదా మందపాటి గోడల మధ్య ఉన్నప్పుడు మొబైల్ సిగ్నల్స్ లోపలికి రావడానికి ఇబ్బంది పడతాయి. మీరు ఇలాంటి చోట్ల ఉండి కాల్ మాట్లాడుతుంటే సిగ్నల్ కట్ అవ్వడం సహజం. కాబట్టి కాల్ మాట్లాడేటప్పుడు లేదా ఇంటర్నెట్ వాడేటప్పుడు కిటికీ దగ్గరకు గానీ, లేదా కొంచెం బయట ఓపెన్ ప్లేస్‌లోకి గానీ వచ్చి ప్రయత్నించండి. దీంతో ఫోన్‌లో పూర్తి స్థాయి సిగ్నల్స్ కనిపిస్తాయి.

Also Read: యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

Tags

Related News

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

రూ.759కే 80 గంటల ప్లేటైమ్, ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్ బడ్స్

Big Stories

Advertisement
×