Best Phones Under 20000: రూ.20 వేల బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శాంసంగ్‌లో మీ కోసం కొన్ని సూపర్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ మార్కెట్లో చాలా మోడల్స్ ఉండటంతో.. దేని కెమెరా బాగుంటుంది, ఏది ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది, తక్కువ బడ్జెట్‌కు ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనే కన్‌ఫ్యూజన్ రావడం సహజం. అందుకే మీ పనిని సులువు చేస్తూ.. రూ.20 వేల లోపు దొరికే 4 బెస్ట్ శాంసంగ్ 5G ఫోన్ల లిస్ట్ ఇక్కడ తీసుకొచ్చాం. వీటిలో తక్కువ ధరలో వచ్చేది ఏది? అమోలెడ్ స్క్రీన్, భారీ బ్యాటరీ ఉన్న మోడల్స్ ఏవి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ నాలుగు ఫోన్లలో తక్కువ ధరలో దొరికే మోడల్ ఇదే. దీని ధర రూ.15,999 నుంచి రూ.19,999 మధ్యలో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 4GB లేదా 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఇచ్చారు. మెమరీ కార్డుతో 2TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా.. అమోలెడ్ స్క్రీన్ అంత క్వాలిటీ ఉండదు. కానీ 6,000mAh భారీ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ దీని మెయిన్ ప్లస్ పాయింట్.
వీడియోలు ఎక్కువగా చూసేవారికి, మంచి డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 6.65 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఎక్సినోస్ 1330 ప్రాసెసర్, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 17,999 నుంచి రూ. 19,999 వరకు ఉంది.
Also Read: స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా స్మార్ట్ గ్లాసెస్.. ఏఐ ఫీచర్లతో మన జీవితాన్ని ఇవి ఎలా మార్చబోతున్నాయంటే!
ఈ లిస్టులో అక్టోబర్ 2026లో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫోన్ ఇదే. ఇందులో కూడా 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ 1330 ప్రాసెసర్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే.. 50MP ప్రైమరీ, 5MP అల్ట్రా-వైడ్, 2MP మరో లెన్స్ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.17,999 నుంచి రూ.18,999 మధ్యలో ఉంది. తక్కువ బడ్జెట్లో లేటెస్ట్ అమోలెడ్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బాగా సెట్ అవుతుంది.
సాధారణ వాడకానికి, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోసం చూసేవారికి ఇది మంచి ఛాయిస్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. వెనుక 50MP కెమెరా, ముందు 8MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6,000mAh బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ.16,699 నుంచి రూ.17,945 వరకు ఉంది. అయితే ఇందులో అమోలెడ్ స్క్రీన్ లేకపోవడం గమనించాలి. కొనే ముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా శాంసంగ్ వెబ్‌సైట్‌లో లేటెస్ట్ ఆఫర్లు, ధరలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: కరెన్సీ నోటుకు డిజిటల్ రూపం.. అసలు ఈ e₹ ఎలా పనిచేస్తుంది? UPI కంటే ఇది ఎందుకు భిన్నం?