E-Paper
Advertisement

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ అవుతోందా?కారణాలివే!
Advertisement

Mobile battery lifespan: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు దాని బ్యాటరీ రోజంతా నాన్‌స్టాప్‌గా పనిచేస్తూ.. భలే కిక్ ఇస్తుంది. కానీ, కొన్ని నెలలు గడవగానే ఛార్జింగ్ వేగంగా తగ్గడం మొదలవుతుంది. అసలు కొత్త ఫోన్ బ్యాటరీ బలహీన పడటానికి ఎంత సమయం పడుతుంది? దానికి వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల పని తీరులో వస్తున్న మార్పులు, వాటి జీవిత కాలం, అలాగే కొత్త బ్యాటరీ మార్చుకోవాలంటే.. అయ్యే ఖర్చుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన శరీరంలో ఒక భాగమైపోయింది. అయితే.. ఎంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొన్నా సరే, కొంత కాలానికి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోవడం ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే కామన్ సమస్య. దీన్ని టెక్ పరిభాషలో ‘బ్యాటరీ డిగ్రేడేషన్’ అంటారు.

బ్యాటరీ బలహీనపడటానికి ఎంత సమయం పడుతుంది?

Advertisement

సాధారణంగా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో లిథియం-అయాన్ లేదా సిలికాన్-కార్బన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఒక కొత్త ఫోన్ బ్యాటరీ సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాల వరకు చాలా బాగా పనిచేస్తుంది. దీనిని ‘ఛార్జ్ సైకిల్స్’ ఆధారంగా లెక్కిస్తారు. ఒక ఫోన్‌ను 0% నుండి 100% వరకు పూర్తిగా ఛార్జ్ చేసి వాడితే ఒక సైకిల్ పూర్తయినట్లు. సాధారణ మిడ్-రేంజ్ ఫోన్ల బ్యాటరీలు 500 నుంచి 800 ఛార్జ్ సైకిల్స్ తర్వాత తమ అసలు సామర్థ్యంలో 20% కోల్పోతాయి.

అదే ఐఫోన్ (iPhone 15, 16 సిరీస్) లేదా లేటెస్ట్ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే.. 1,000 ఛార్జ్ సైకిల్స్ వరకు (సుమారు 3 ఏళ్లు) 80% బ్యాటరీ హెల్త్‌ను కాపాడుకుంటాయి.

Advertisement

కొత్త ఫోన్ బ్యాటరీ త్వరగా బలహీనపడటానికి  ప్రధాన కారణాలు:

అధిక వేడి : లిథియం-అయాన్ బ్యాటరీలకు అతిపెద్ద శత్రువు వేడి. ఎండలో.. ఫోన్ వాడటం, ఛార్జింగ్ పెట్టి హెవీ గేమ్స్ ఆడటం వల్ల బ్యాటరీ లోపలి రసాయనాలు త్వరగా దెబ్బతింటాయి.

0% నుంచి 100% ఛార్జింగ్ అలవాటు: ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు (0%) వాడటం, రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయడం వల్ల బ్యాటరీ సెల్స్‌పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఎప్పుడూ 20% నుంచి 80% మధ్యలో ఛార్జింగ్ ఉంచడం బెస్ట్ ప్రాక్టీస్.

ఫాస్ట్ ఛార్జింగ్ & డూప్లికేట్ ఛార్జర్లు: ప్రస్తుతం 80W, 120W ఫాస్ట్ ఛార్జర్లు ట్రెండ్ అయ్యాయి. ఇవి నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసినా, ఆ సమయంలో పుట్టే వేడి బ్యాటరీ లైఫ్‌ను తగ్గిస్తుంది. ఇక లోకల్ ఛార్జర్లు వాడితే బ్యాటరీ ఉబ్బిపోయే ప్రమాదం కూడా ఉంది.

Also Read: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

5G నెట్‌వర్క్ & హై రిఫ్రెష్ రేట్: తరచూ 5G డేటా ఆన్‌లో ఉంచడం, స్క్రీన్ బ్రైట్‌నెస్ ఫుల్‌గా పెట్టడం, 120Hz రిఫ్రెష్ రేట్ వాడటం వల్ల బ్యాటరీపై లోడ్ పెరిగి త్వరగా ఛార్జింగ్ సైకిల్స్ పూర్తవుతాయి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్: మనం వాడకపోయినా.. సోషల్ మీడియా యాప్స్, లొకేషన్ సర్వీసులు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ బ్యాటరీని ఖర్చు చేస్తుంటాయి.

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ అనేది కాలక్రమేణా క్షీణించే పరికరం. సరైన ఛార్జింగ్ అలవాట్లు, ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ ఫీచర్లు వాడటం ద్వారా మీ కొత్త ఫోన్ బ్యాటరీని కనీసం మూడేళ్ల పాటు కొత్త దానిలా కాపాడుకోవచ్చు.

Related News

రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!

ఫోటోలతో స్కామ్‌లు పెరుగుతున్నాయా? క్షణాల్లో ఏఐ ఇమేజ్‌లు గుర్తించండిలా !

యాపిల్, శాంసంగ్‌లకు చెక్ పెట్టబోతున్న OpenAI.. త్వరలోనే యాప్స్ లేని కొత్త స్మార్ట్‌ఫోన్!

జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.450 రీఛార్జ్‌తో ఫ్రీ జియో హాట్‌స్టార్, ఏడాది పాటు కాన్వా ప్రో లైట్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..రూ.999కే ఇయర్‌బడ్స్!

రూ.759కే 80 గంటల ప్లేటైమ్, ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ ఇయర్ బడ్స్

వాట్సప్‌లో జస్ట్ Hi అని మెసేజ్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు ఇట్టే తెలుసుకోవచ్చు!

Big Stories

Advertisement
×