BSNL 4G : BSNL 4G నెట్వర్క్ స్లో ఉందా.. ఎప్పటికప్పుడు డేటా సమస్య వేధిస్తుందా.. నిజానికి సిగ్నల్ సరిగ్గా రాకపోవటం పెద్ద సమస్యే. ఈ ఇంటర్నెట్ కాలంలో హైస్పీడ్ డేటా తప్పనిసరి. మరి ఈ సమస్య నుంచి స్లో నెట్వర్క్ వస్తున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎలా గట్టేక్కాలో ఓసారి తెలుసుకుందాం.
ఒకప్పుడు టాప్ టెలికాం సంస్థగా ఉన్న BSNL.. నెమ్మదిగా వెనుకబడిందనే మాట వాస్తవమే. అయితే ఈ టెలికాం సంస్థ ఇప్పుడిప్పుడే తన సేవలను మరింత మెరుగుపరుచుకుంటుంది. 2025 నాటికి దాదాపు 1 లక్ష టవర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగైన రీఛార్జ్ ప్లాన్స్ ను సైతం అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ బెస్ట్ ప్లాన్స్ ను అందిస్తుంది. ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌లో వేగంగా పని చేస్తున్న ఈ సంస్థ త్వరలోనే హై స్పీడ్ డేటాను అందించాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే కొందరు వినియోగదారులు BSNL నెట్‌వర్క్ స్లోగా ఉంటుందని.. చాలా చోట్ల సిగ్నల్ రాదని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే మీ ఫోన్ లో సైతం బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ స్లో ఉంటే హై స్పీడ్ ఇంటర్నెట్ గా క్షణాల్లో మార్చేయెచ్చు. ఇందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరి. ఫోన్ లోనే కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే డేటాను హై స్పీడ్ లో పొందొచ్చు.
STEP 1: ఫోన్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి
STEP 2: నెట్‌వర్క్, ఇంటర్నెట్ పై క్లిక్ చేయాలి
STEP 3: SIM కార్డ్ ఆఫ్షన్ పై క్లిక్ చేశాక.. ఇష్టమైన SIM కార్డ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
STEP 4: స్క్రోల్ చేస్తూ ప్రాధాన్య నెట్‌వర్క్ ఎంపిక చేసి ఓకే చేయాలి
STEP 5: ఇక్కడ BSNL 4G సర్వీస్ నెట్ వర్క్ కనిపిస్తుంది.
STEP 7: దగ్గరలో BSNL 4G ఇంటర్నెట్ ఉంటే మాత్రమే ఈ సెట్టింగ్స్ పనిచేస్తాయి.
ఈ సెట్టింగ్స్ తో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను హైస్పీడ్ గా మార్చుకునే అవకాశం ఉంది. ఇక వీటితో పాటు మరికొన్ని మార్పులు చేసుకుంటే మరింత స్పీడ్ నెట్వర్క్ ను పొందొచ్చు.
ఫోన్, యాప్స్ అప్డేట్ –
నెట్వర్క్ సమస్య ఉన్నప్పుడు యాప్స్ ను అప్డేటే చేయటం తప్పనిసరి. దీంతో ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్ అవుతుంది. ఏదైనా సమస్యతో ఇంటర్నెట్ పని చేయకపోతే అప్డేట్ తర్వాత బగ్ సమస్య కూడా క్లియర్ అవుతుంది.
క్లియర్ యాప్ కాష్ –
ఫోన్ లో యాప్ కాష్‌ను క్లియర్ చేశాక ఫోన్ మరింత క్లియర్గా పనిచేస్తుంది. దీంతో డేటా స్పీడ్ గా వస్తుంది. వీటితో పాటు వెబ్ బ్రౌజర్ లో హిస్టరీని తొలగించటం, అందులో కాష్‌ను క్లియర్ చేయటం చేయాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతన్న యాప్స్ సైతం క్లియర్ చేస్తే డేటా సమస్య పరిష్కారమవుతుంది. ఇక ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టటం, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయటం వంటివి చేస్తే డేటా స్పీడ్ గా అందుబాటులోకి వస్తుంది.
ALSO READ : మీ గ్యాడ్జెట్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవుట్ అవుతుందా! చెక్ చేసేయండిలా