BigTV English

Threat To Abhinav Arora : పదేళ్ల పిల్లాడినీ వదలని లారెన్స్ బిష్ణోయ్.. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటీ?

Threat To Abhinav Arora : పదేళ్ల పిల్లాడినీ వదలని లారెన్స్ బిష్ణోయ్.. ఇంతకీ ఆ బాలుడు చేసిన తప్పేంటీ?

Threat To Abhinav Arora : సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తమ 10 ఏళ్ల బాలుడికి ప్రాణ హాని ఉందంటూ ఓ తల్లి వాపోయింది. బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు తమ కొడుకుని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ.. అభినవ్ అరోరా అనే కుర్రాడు తల్లి జ్యోతి అరోరా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కుమారుడికి ఆధ్యాత్మిక భావన తప్పా.. మరే ఇతర వ్యాపకాలు లేవని, చిన్న వయసులోనే  ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. బిష్ణోయ్ గ్యాంగు నుంచి బెదిరింపుల వస్తున్న నేపథ్యంలో అసలేం జరిగిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.


అభినవ్ అరోరా అనే కుర్రాడు గతంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పండితులు, జగద్గురు రామభద్రాచార్య పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో స్వామి వారి వద్దకు వెళ్లి.. సోషల్ మీడియా కోసం రీల్ చేసే ప్రయత్నం చేశాడు అభినవ్. దాంతో.. కోపగించుకున్న రామభద్రాచార్యులు.. కుర్రాడిని సున్నితంగా మందలించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

అందులో.. అభినవ్ తీరు సరిగా లేదని, పిల్లల్ని గురువుల వద్దకు పంపేటప్పుడు.. తల్లిదండ్రులు, ఇలా వీడియోలు, రీల్స్ కోసం ప్రోత్సహించడం సరైన విధానం కాదంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పైగా.. రామభద్రాచార్యులకు దేశంలో విశేష గుర్తింపు ఉంది. ఆయనకు అసహనం కలిగించడంతో దేశంలో చాలా మంది అభినవ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయమై… బిష్ణోయ్ గ్యాంగ్ అభినవ్ కు హెచ్చరికలు చేసినట్లుగా వారి తల్లి చెబుతున్నారు. అయితే.. ఈ విషయమై ఇంకా ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. పైగా.. అభినవ్ తల్లి ఎలాంటి ఆధారాలు మీడియాకు చూపించలేదు.


ఎవరీ అభినవ్ అరోరా..?

అభినవ్ అరోరాకు ఇప్పుడు 10 ఏళ్లు. ఇతను 3 ఏళ్ల చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయాలను అందరికీ చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం.. సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతూ, చాలా మందికి చేరువయ్యాడు. క్రమంగా సోషల్ మీడియా ఇన్పూయెన్సర్ గా గుర్తింపు పొందిన అభినవ్.. తనకు తాను “బాల్ సంత్ బాబా” గా చెప్పుకుంటూ ఉంటాడు. అనేక విషయాలపై ఆధ్యాత్మిక కోణంలో వీడియోలు చేసే అభినవ్ అరోరాకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 9.50 లక్షల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.

ఈ కుర్రాడు యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా తన ఆధ్యాత్మిక విషయాల్ని ప్రచారం చేస్తుంటాడు. భక్తి భావాన్ని పెంపొందించేలా చేయడంతో పాటు, భగవాన్ శ్రీ కృష్ణుడి గురించిన విషయాల్ని చెబుతుంటాడు. ఈ కుర్రాడి ఇన్ స్టాగ్రామ్ బయో ప్రకారం.. దేశంలో తానే అతిపిన్న ఆధ్యాత్మికవేత్తగా చెబుతున్నాడు.

Also Read : బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌‌‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం

అభినవ్ అరోరు రామభద్రాచార్యుల దగ్గర వీడియో కోసం ప్రయత్నించినప్పుడు గురువు గారు కోప్పడిన మాట వాస్తమే అంటున్న అతని తల్లి జ్యోతి.. అదే కార్యక్రమంలో అభినవ్ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రామభద్రాచార్యలు చాలా సంతోషించారని, స్టేజి పైనే అభినందించారంటూ చెబుతున్నారు. కానీ… సోషల్ మీడియాలో ఆయన కోప్పడిన వీడియోనే వైరల్ అవుతుందని.. అభినందించిన వీడియో గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×