BigTV English

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Online Shopping : ప్రస్తుతం ఆఫర్ల సీజన్‌, పండగ సేల్ నడుస్తోంది. ప్రముఖ ఇ- కామర్స్‌ సంస్థలు అదిరే ఆఫర్లతో వినియోగదారులకు కావాల్సిన ప్రొడక్ట్స్​ను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే చాలా మంది తాము కొనాల్సిన ప్రొడక్టులను కార్ట్‌లో యాడ్‌ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు.


అయితే వాస్తవానికి కొన్ని వస్తువుల ధరలను, ఈ ఆఫర్ల సేల్స్​కు ముందుగానే పెంచేసి ఆ తర్వాత ఈ సేల్స్​లో తక్కువ ధరకే అందిస్తున్నట్లు ప్రకటిస్తుంటారు. ఇది తెలియని కొంతమంది వినియోగదారులు, ఆఫర్‌ సమయంలో సదరు ప్రొడక్ట్​ తక్కువ ధరకే వచ్చేస్తున్నట్లు, దానినే వారు కొనేసినట్లు సంబరపడిపోతుంటారు. అందుకే ఫలానా వస్తువు అసలు ధరెంత? ఏ సమయంలో తక్కువ ధరకు అమ్మారు? అసలు ప్రస్తుతం తగ్గింపు ధరతోనే అమ్ముతున్నారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ప్రైస్‌ హిస్టరీ ద్వారా తెలుసుకోవాలి. మరి ఆ ప్రైస్ హిస్టరీ ఎలా చూడాలి అంటే?

యాప్‌ సాయంతో – ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా వస్తువును సెర్చ్​ చేసినప్పుడు అక్కడే దాని ప్రైస్‌ హిస్టరీని కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ బయటకు వచ్చి చూడాల్సిన అవసరం లేదు. దీని కోసం మొబైల్‌లో ప్రైస్‌ హిస్టరీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌ Buyhatkeను డౌన్‌ లోడ్‌ చేయాలి. ఏ ప్లాట్‌ ఫామ్‌లో అయినా సరే కావల్సిన వస్తువుపై క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న షేర్‌ ఆప్షన్‌పై నొక్కాలి. అప్పుడు ముందుగా ఇన్‌స్టాల్‌ చేసిన Buyhatke యాప్‌ కనపడుతుంది. దాన్ని ఎంచుకోవాలి. దీంతో యాప్‌ నుంచి బయటకు రాకుండానే అక్కడే ఓ పాప్‌అప్‌ ఓపెన్ అవుతుంది.


ALSO READ : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

అందులో సదరు ప్రొడక్ట్​ ప్రైస్‌ హిస్టరీ ఎంచక్కా కనిపిస్తుంది. దాని గరిష్ఠ ధర ఎంత, కనిష్ఠ ధర ఎంత, ఎప్పుడెప్పుడు ఆ వస్తువు ధర తగ్గింది? ఎంత తగ్గింది? ఇలా అన్ని విషయాలు అక్కడే ఉన్న ఓ చార్ట్‌లో కనిపిస్తాయి. అలానే రానున్న రోజుల్లో ఈ వస్తువు ధర తగ్గే ఛాన్స్​ ఉందా? అనే విషయం కూడా కనిపిస్తుంది. ఇంకా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ఆ ప్రొడక్ట్​ ధర ఎంతుంది అనేది కూడా COMPAREలో తెలుసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సిన వస్తువు ధర తగ్గిందని తెలుసుకునేందుకు కూడా అక్కడే ఉన్న అలర్ట్‌ను సెట్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

వెబ్‌సైట్‌ సాయంతో కూడా తెలుసుకోవచ్చు – ఇంకా ఏ ఇ- కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోని ప్రొడక్ట్స్​ ధరనైనా pricehistoryapp.comలో వెతకొచ్చు. ఇందుకోసం కావాల్సిన వస్తువు లింక్‌ను ప్రైజ్‌ హిస్టరీ వెబ్‌సైట్‌లోని సెర్చ్‌ బార్‌లో టైప్ చేయాలి. అంతే ధరలు వివరాలు మొత్తం కనిపిస్తాయి. వస్తువు ధర ఎప్పుడు ఎంతుందనేది కూడా తెలుస్తుంది.

ఎక్స్‌టెన్షన్‌తోనూ తెలుసుకోవచ్చు – ఎక్స్‌టెన్షన్‌ సాయంతోనూ ప్రైస్‌ హిస్టరీని చూడొచ్చు. అమెజాన్‌లో keepa ఎక్స్‌టెన్షన్‌ ద్వారా తెలుస్తుంది. ఈ ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్‌ చేసి, ఆ తర్వాత ప్రొడక్ట్‌ను ఓపెన్‌ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే ఓ చార్ట్‌ కనిపిస్తుంది. అందులో ఏ రోజు ఎంత ధర ఉంది అనే పక్కాగా తెలుసుకోవచ్చు.

అదే ఫ్లిప్‌ కార్ట్‌లో అయితే PRICE HISTORY అనే ఎక్స్‌టెన్షన్‌ను బ్రౌజర్‌కు యాడ్‌ చేయాలి. అమెజాన్​లో కనపడినట్టే ఇక్కడ కూడా ప్రైస్‌ చార్ట్‌ దర్శనమిస్తుంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×