E-Paper
Advertisement

మీ జీతంలో సగం ఈఎంఐలకే పోతే.. జీవితం ఎంత డేంజరో తెలుసా!

మీ జీతంలో సగం ఈఎంఐలకే పోతే.. జీవితం ఎంత డేంజరో తెలుసా!
Advertisement

How to manage heavy EMI debt: ఈ రోజుల్లో కోరుకున్న వస్తువు ఏదైనా సరే ఇన్‌స్టంట్ లోన్ లేదా ఈఎంఐ (EMI) పద్ధతిలో కొనడం చాలా కామన్ అయిపోయింది. క్రెడిట్ కార్డులు,పర్సనల్ లోన్లు, కార్ లోన్లు అంటూ ప్రతీ దానికీ ఈఎంఐ కట్టేస్తూ .. జీత మంతా అప్పులకే సరి పోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక వేళ మీ నెల వారీ ఆదాయంలో.. ఏకంగా 50 శాతం లేదా అంతకంటే .. ఎక్కువ భాగం కేవలం ఈఎంఐల చెల్లింపులకే పోతున్నట్లయితే.. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. ఈ అప్పుల చిక్కుముడి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. అప్పుల ఊబిలోకి ఎలా జారుకుంటాం?

మనం సంపాదించే సంపాదనలో . ప్రతీ నెలా ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఆదా చేస్తున్నాం అనే లెక్క సరిగ్గా లేక పోవడమే అసలు సమస్య. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ పుణ్యమా అని కూర్చొన్న చోట నుంచి నిమిషాల్లో లోన్ వచ్చేస్తోంది. దీన్ని చూసి అవసరానికి మించి వస్తువులు కొనేయడం, క్రెడిట్ కార్డు బిల్లులు టైంకి కట్టలేక రివాల్వింగ్ క్రెడిట్‌లో పడిపోవడం జరుగుతుంది. ఫలితంగా నెల ప్రారంభం కాగానే జీతం రావడం, అలా రావడంతోనే ఈఎంఐల రూపంలో సగానికి పైగా డబ్బులు మాయం కావడం జరుగుతుంది.

2. 50% ఈఎంఐ రూల్ ఎంతవరకు కరెక్ట్?

Advertisement

ఫైనాన్షియల్ నిపుణుల ప్రకారం.. మన మొత్తం నెల వారీ ఆదాయంలో అప్పుల చెల్లింపుల కోసం కేటాయించే మొత్తం 35 నుంచి 40 శాతాన్ని మించ కూడదు. ఒకవేళ.. మీ ఈఎంఐలు మీ ఆదాయంలో.. 50 శాతాన్ని దాటి పోతే, అది మిమ్మల్ని ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. అనుకోని ఆరోగ్య సమస్యలు లేదా ఉద్యోగంలో ఒడిదుడుకులు వస్తే.. ఈఎంఐలు కట్టలేక సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో.. అత్యవసర సమయాల్లో ఎవరి దగ్గరా అప్పు పుట్టకుండా చేస్తుంది.

3. అప్పుల చిక్కుముడి విప్పే మార్గాలు ?

మీరు కనుక ఇప్పటికే ఈ 50% ట్రిప్‌లో చిక్కుకుని ఉంటే.. కంగారు పడాల్సిన పనిలేదు. కొన్ని పక్కా ప్రణాళికలతో దీని నుంచి బయటపడొచ్చు.

Advertisement

అప్పుల లిస్ట్ తయారీ: మీకు ఉన్న అన్ని రకాల అప్పులు, వాటి వడ్డీ రేట్లను ఒక పేపర్ మీద రాసుకోండి.

అలాంచ్‌ లేదా స్నోబాల్ పద్ధతి: అత్యధిక వడ్డీ ఉన్న లోన్‌ను ముందుగా తీర్చడం లేదా చిన్న లోన్లను మొదట క్లోజ్ చేయడం ద్వారా బరువును తగ్గించుకోవాలి.

ముందస్తు చెల్లింపు : బోనస్ లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు వాటిని ఖర్చు చేసేయకుండా.. లోన్ ప్రి-పేమెంట్‌కి కేటాయించండి.

4. కొత్త అప్పులకు దూరంగా ఉండటం:

మరి కొన్ని రోజులు పాటు ఎలాంటి కొత్త లోన్లు, ఈఎంఐల జోలికి వెళ్లకపోవడమే చాలా ముఖ్యం. ఫెస్టివల్ డిస్కౌంట్లు, జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు అని కంట్లో.. పడిన ప్రతీ దానికీ అప్పుల పాలు కావద్దు. ‘డబ్బులు ఉంటేనే.. కొందాం ‘ అనే రూల్‌ను జీవితంలోకి తెచ్చుకోండి. క్రెడిట్ కార్డులను ఎమర్జెన్సీకి మాత్రమే వాడండి తప్ప షాపింగ్ కోసం వాటిని స్వైప్ చేయడం పూర్తిగా బంద్ చేయండి.

Also Read: డ్రీమ్ హోమ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే..జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!

5. ఎమర్జెన్సీ ఫండ్:

అప్పుల నుంచి శాశ్వతంగా బయట పడాలంటే.. ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం చాలా ముఖ్యం. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరి పడా డబ్బును.. వేరే బ్యాంకు ఖాతాలో దాచుకోవాలి. దీని వల్ల ఎప్పుడైనా జాబ్ లాస్ లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే.. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన అవసరం రాదు. మీ కుటుంబ భవిష్యత్తును ఆర్థికంగా సేఫ్ గా ఉంచుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం.

అప్పు అనేది మన అజాగ్రత్త వలనే.. మన మెడకు చుట్టుకునే ఉచ్చుగా మారుతుంది. మీ ఆదాయంలో సగం ఈఎంఐలకే ..పోతున్నట్లయితే ఇప్పుడే మేలుకోండి. అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకుంటే ..కొన్ని నెలల్లోనే ఈ అప్పుల చిక్కుముడి వీడిపోతుంది. ప్రశాంతమైన, అప్పులు లేని జీవితాన్ని మీ సొంతం చేసుకోండి!

 

Related News

సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!

తక్కువ ధరలోనే బెస్ట్ సౌండ్ ! నాయిస్ బడ్స్ N1పై అదిరిపోయే ఆఫర్!

బడ్జెట్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ! రూ.20k లోపు ట్రెండింగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే!

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

Big Stories

Advertisement
×