E-Paper
Advertisement

అక్రమంగా సంపాదించినవి పీకడానికే వెళ్లాం.. జగదీశ్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఫైర్

అక్రమంగా సంపాదించినవి పీకడానికే వెళ్లాం.. జగదీశ్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఫైర్
Advertisement

Addanki Dayakar: కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు చెక్ పెడుతూ ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకుల అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని, ప్రజల ముందు వారి అసలు రూపాన్ని నగ్నంగా నిలబెడతామని స్పష్టం చేశారు.

దోపిడీ కే అడ్డాగా బిఆర్ఎస్ పాలన

Advertisement

తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ నాయకులు, పదేళ్ల పాటు రాష్ట్ర సంపదను యథేచ్ఛగా దోచుకున్నారని అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ చుట్టూ చేరి కోట్లు కూడబెట్టిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసిన వీరు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలను, ప్రజా సంక్షేమ ధ్యేయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

అక్రమాల నిలయం జగదీశ్ రెడ్డి

Advertisement

‘మేము ఏం ఫీకడానికి పోయాం’ అని ప్రశ్నిస్తున్న జగదీశ్ రెడ్డికి ఘాటుగా సమాధానమిస్తూ.. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను, సాగించిన దోపిడీని బయటకు తీయడానికే తాము వెళ్తున్నామని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మాట తప్పిన జగదీశ్ రెడ్డి, ఎస్సీ మంత్రిగా ఉండి కూడా నిమ్న వర్గాలకు చేసిందేమీ లేదన్నారు.

భూముల కొల్లగొట్టుడు.. నిమ్న వర్గాల దగా

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి పేదల భూములను గుంజుకున్నారని ఆరోపించారు. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన భూములను, దేవాలయ భూములను, అసైన్డ్ స్థలాలను బిఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా కొల్లగొట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిమ్న జాతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతి ఒక్కరి ముసుగు తొలగిస్తామని, ఈ అక్రమాలను పూర్తి వివరాలతో ప్రజల ముందు ఉంచే అవకాశం తమకు ఇవ్వాలని అద్దంకి దయాకర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం జరపాలి.. కాంగ్రెస్, BRSల మధ్య క్విడ్ ప్రో కో ఉందా?- రాంచందర్‌రావు

Tags

Related News

హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం జరపాలి.. కాంగ్రెస్, BRSల మధ్య క్విడ్ ప్రో కో ఉందా?- రాంచందర్‌రావు

రొయ్యలు, బిర్యానీలు తిని నీళ్లను రాయలసీమకు అప్పగించారు.. KCRపై జూపల్లి సంచలన వ్యాఖ్యలు!

శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

బడా నేతల భూ భాగోతం అవుట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

Big Stories

Advertisement
×