E-Paper
Advertisement

డ్రీమ్ హోమ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే..జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!

డ్రీమ్ హోమ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే..జీవితాంతం పశ్చాత్తాప పడాల్సిందే!
Advertisement

Best home loan tips: సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి జీవితంలోని అత్యంత అందమైన కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలా మంది బ్యాంకుల నుంచి హోం లోన్స్ ఆశ్రయిస్తారు. అయితే.. సరైన అవగాహన లేకుండా లోన్ తీసుకోవడం వల్ల ఈఎంఐలు నెలకు వేలల్లో ఉంటుంది. లోన్ తీసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న పొర పాట్ల వల్ల మీరు లక్షల రూపాయలు నష్ట పోయే ప్రమాదం ఉంది. ఇల్లు కొనే ముందు మీరు చేయకూడని ఆరు ముఖ్యమైన తప్పులు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

1. సిబిల్ స్కోర్ నిర్లక్ష్యం చేయడం:

చాలా మంది ఇల్లు కొనాలని అనుకున్న వెంటనే నేరుగా బ్యాంకులకు వెళ్లి లోన్ అప్లై చేస్తుంటారు. కానీ.. మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది ముందే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లను విధిస్తాయి. దీనివల్ల లోన్ టెన్యూర్ మొత్తంలో మీరు అదనంగా లక్షల రూపాయలు వడ్డీ రూపంలో నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి లోన్ అప్లై చేసే ముందే మీ క్రెడిట్ స్కోర్‌ పెంచుకోవడం బెస్ట్.

2. బడ్జెట్ అంచనా :

Advertisement

మీ నెల వారీ ఆదాయానికి, మీ సామర్థ్యానికి మించిన ఖరీదైన ఇల్లును కొనడం మొదటి పెద్ద తప్పు. మీ మొత్తం నెల వారీ ఆదాయంలో 40 శాతానికి మించి హోమ్ లోన్ ఈఎంఐ ఉండకూడదనే రూల్ ఉంది. ఈ రూల్‌ను పక్కన పెట్టి భారీ మొత్తంలో లోన్ తీసుకుంటే.. భవిష్యత్తులో చిన్న ఆర్థిక సమస్య వచ్చినా ఈఎంఐలు కట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది.

3. డౌన్ పేమెంట్ :

కొందరు వీలైనంత తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి, మిగతాదంతా లోన్ రూపంలో తీసుకోవాలని చూస్తారు. బ్యాంక్ ఇస్తుంది కదా అని 90% వరకు లోన్ తీసుకుంటే.. అసలు మీద పడే వడ్డీ భారం విపరీతంగా పెరిగి పోతుంది. కనీసం 20 నుంచి 30 శాతం మొత్తాన్ని మీ సొంత డబ్బుల నుంచి డౌన్ పేమెంట్‌గా చెల్లించడానికి ప్రయత్నించండి. దీని వల్ల లోన్ అమౌంట్ తగ్గి, ఈఎంఐ భారం చాలా వరకు తగ్గుతుంది.

4. కేవలం వడ్డీ రేటు:

Advertisement

కొత్తగా ఇల్లు కొనే వాళ్ళు చేసే మరో సాధారణ తప్పు కేవలం తక్కువ వడ్డీ ఇస్తారనే.. ఉద్దేశంతో ఏప్రిల్ లేదా ఇతర ప్రాసెసింగ్ ఫీజులను గమనించకుండా బ్యాంక్‌ను ఎంచుకోవడం. వడ్డీ రేటుతో పాటు.. ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ చార్జెస్, ప్రీ-పేమెంట్ ఛార్జెస్ ,హిడెన్ కాస్ట్స్ అన్నింటినీ బేరీజు వేసుకోవాలి.అలాగే కస్టమర్ సర్వీస్ ఎలా ఉందో కూడా చూసుకోవడం చాలా అవసరం.

5. లోన్ టెన్యూర్ :

ఈఎంఐ భారం తక్కువగా ఉండాలనే.. ఉద్దేశంతో 25 నుంచి 30 ఏళ్ల పాటు లోన్ టెన్యూర్ ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. టెన్యూర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మీరు బ్యాంకుకు కట్టే వడ్డీ అంత ఎక్కువగా ఉంటుంది.ఒకటికి రెండు సార్లు లెక్కేసుకుని వీలైనంత తక్కువ కాలపరిమితిలో (ఉదాహరణకు 15 లేదా 20 ఏళ్లు) లోన్ తీర్చుకునేలా ప్లాన్ చేసుకోవడం ఫైనాన్షియల్‌గా చాలా సేఫ్.

Also Read: ఈ రోజు రూ.50,000 బంగారంలో పెట్టుబడి పెడితే 10 ఏళ్ల తరువాత ఎంత వస్తుంది?

6. లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్:

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు చాలా మంది లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్‌ను వదిలేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆ అప్పుల భారం కాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ ఉండటం అత్యంత ముఖ్యం. ఇది మీ కుటుంబానికి భవిష్యత్తులో ఒక  ఆర్థిక భద్రతను ఇస్తుంది.

సొంతిల్లు అనేది కేవలం ఒక ఆస్తి కాదు, అది జీవితాంతం మనకు ప్రశాంతతను ఇవ్వాలి. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా తొందర పాటుతో అడుగులు వేస్తే.. ఆనందానికి బదులు అప్పుల ఊబిలోకి జారిపోతాము. ఇల్లు కొనే ముందు ఈ ఆరు తప్పులను నివారించి.. పక్కా ప్లానింగ్‌తో అడుగుపెట్టండి. మీ కష్టపడి సంపాదించిన ప్రతీ రూపాయిని కాపాడుకోండి!

Related News

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ సెంటర్.. ఏఐ మౌలిక వసతులకు బూస్ట్

ఇండియాలో మాయమవుతున్న 1 BHK ఇళ్లు.. డిమాండ్ ఉన్నా నిర్మాణాలు తక్కువ.. కారణాలు ఇవే

ఈ రోజు రూ.50,000 బంగారంలో పెట్టుబడి పెడితే 10 ఏళ్ల తరువాత ఎంత వస్తుంది?

40 దాటిన ఉద్యోగుల్లో పెరుగుతున్న లేఆఫ్ భయం.. కార్పొరేట్ కంపెనీల్లో ఏం జరుగుతోందంటే?

బంగారం కొనేవారికి శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మార్కెట్లో ధరలు చూద్దాం

మంచి కార్పొరేట్ జాబ్ వదిలి వ్యవసాయం.. కట్ చేస్తే రూ.కోట్ల బిజినెస్‌ చేస్తున్న యువతి

టాటా సన్స్‌లో మళ్లీ ముసలం.. ట్రస్ట్ సంచలన ప్రకటన, చంద్రశేఖరన్ నియామకం చెల్లదు

Big Stories

Advertisement
×