Best Fully automatic washing machines under 20000: ఇంటికో వాషింగ్ మెషీన్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదు, ప్రతి ఇంటా అత్యవసరమైన హోం అప్లయన్సెస్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి, పెద్ద కుటుంబాలకు ‘ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్’ సమయాన్ని, శ్రమను చాలా వరకు తగ్గిస్తుంది. అయితే ఎక్కువ ధర పెడితేనే .. మంచి మెషీన్ వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. సరిగ్గా వెతికితే రూ.20వేల బడ్జెట్‌లో పవర్ ఫుల్ మోటార్లు, స్మార్ట్ ఫీచర్లు ఉన్న టాప్ బ్రాండ్స్ దొరుకుతాయి. అవేంటో ఇప్పుుడు తెలుసుకుందాం.
శాంసంగ్ బ్రాండ్ అంటేనే నమ్మకం. ఈ బడ్జెట్‌లో లభించే శాంసంగ్ ఇకోబబుల్ టెక్నాలజీ మోడల్స్ బట్టల లోపలికి డిటర్జెంట్‌ను వేగంగా చొచ్చుకుపోయేలా చేస్తాయి. దీని వల్ల తక్కువ నీటితో.. చల్లని నీటిలోనే బట్టలు అత్యంత శుభ్రంగా ఉతుకుతాయి. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉండటం వల్ల కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ వస్తుంది. నాయిస్ తక్కువగా రావడంతో పాటు దీని లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎల్జీ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.20వేలలోపు బడ్జెట్‌లో లభించే ఎల్జీ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్లలో ‘టర్బో డ్రమ్’, ‘స్మార్ట్ ఇన్వర్టర్’ ఫీచర్లు వస్తాయి.ఇవి బట్టలను చాలా మృదువుగా ఉతుకుతాయి. ముఖ్యంగా ఆటో రీస్టార్ట్, చైల్డ్ లాక్ వంటి సేఫ్టీ ఫీచర్లు చిన్న పిల్లలున్న ఇళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఆప్షన్స్ కోరుకునే వారికి వర్ల్‌పూల్ బెస్ట్ ఛాయిస్. ఇందులో ఉండే ‘హార్డ్ వాటర్ వాష్’ టెక్నాలజీ మన ఇంటికి వచ్చే ఉప్పు నీటిని కూడా బట్టలు ఉతకడానికి అనుకూలంగా మారుస్తుంది. స్పాట్ వాష్ ప్రోగ్రామ్స్, జీరో ప్రెజర్ ఫిల్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు. తక్కువ నీరు ఉన్న ప్రాంతాల వాళ్లకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మరో.. రెండు బ్రాండ్లు హైయర్, వోల్టాస్ బేకో. ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ కెపాసిటీని (7.5 కేజీ నుంచి 8 కేజీ వరకు) అందిస్తున్నాయి. డిజిటల్ డిస్‌ప్లే, మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్, క్వాడ్రా స్టీల్ పల్సేటర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు వీటి సొంతం.
Also Read:రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!
కుటుంబ సభ్యుల సంఖ్య: 2-3 మంది ఉంటే 6.5 నుంచి 7 కేజీ మెషీన్ సరిపోతుంది. అదే 4-5 మంది ఉంటే.. కనీసం 8 కేజీ కెపాసిటీ ఉండేలా చూసుకోవాలి.
స్పిన్ స్పీడ్ : హై స్పిన్ స్పీడ్ ఉన్న మెషిన్లు బట్టలను త్వరగా ఆరేలా చేస్తాయి. 700 నుంచి740 RPM వేగం ఈ బడ్జెట్‌లో ఆప్టిమల్ అని చెప్పొచ్చు.
వారెంటీ: మోటార్‌కు కనీసం 5 నుంచి 10 సంవత్సరాల వారెంటీ ఉండేలా చూసుకోవడం మంచిది.