Canada: కెనడాలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు భారత్ విద్యార్థులు మృతిచెందారు. మృతులను తమిళనాడు, పుదుచ్చేరికి చెందినవారు. విమానం శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత దౌత్యకార్యాలయం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు తగిన సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కెనడాలో విమాన శిక్షణ పొందుతున్న తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులు తమిళనాడుకు చెందిన మనోజ్ శివకుమార్, పురుచ్చేరికి చెందిన శ్రీశరణ్‌గా గుర్తించారు. ఇండియన్ విద్యార్థులు మృతి ఘటన తెలియగానే వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ రియాక్ట్ అయ్యింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. విద్యార్థుల పార్థివ దేహాలను భారత్‌కు తరలించడానికి తగిన సహాయం చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు వివరించలేదు.
కెనడియన్ బ్రాడ్‌కాస్టర్ CBC ప్రకారం.. హార్వ్స్ ఎయిర్‌కు చెందిన సెస్నా 172 విమానం శుక్రవారం తెల్లవారుజామున సస్కట్చేవాన్‌లోని కిస్బే సమీపంలో కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మానిటోబాలోని రెజీనా నుండి స్టెయిన్‌బాచ్ వరకు, సస్కట్చేవాన్‌లోని కార్లైల్ సమీపంలో ఆగేలా ప్రణాళికతో ఆ విమానాన్ని రాత్రి వేళ ఉపయోగించారు. తమ కమర్షియల్ పైలట్ లైసెన్సులకు అవసరమైన ఫ్లయింగ్ అవర్స్‌ను సంపాదించుకోవడానికి ఇద్దరు పైలట్లు ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది. విమానం అనుకున్న గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అది గడువు దాటినట్లు పేర్కొంది.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గాలింపు చేపట్టారు. సహాయక బృందాలు విమాన శకలాలను గుర్తించాయి. ట్రెంటన్‌లోని జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు చెందిన లెఫ్టినెంట్ జోయీ హోలాండర్ మాట్లాడుతూ.. 435 స్క్వాడ్రన్‌కు చెందిన CC-138 హెర్క్యులస్ విమానం ప్రమాద స్థలాన్ని గుర్తించిందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడానికి సాంకేతిక నిపుణులు పారాచూట్ ద్వారా కిందకు దిగారు. గాలింపు, సహాయక చర్యలు తర్వాత ఈ కేసును రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌కు అప్పగించారు.
ALSO READ: రియాద్‌పై హౌతీల మిసైల్ ఎటాక్.. మిడిల్ ఈస్ట్‌లో హై అలర్ట్!
గతేడాది జనవరి నుండి హార్వ్స్ ఎయిర్‌కు సంబంధించి ఇది మూడవ ప్రమాదం. ఆ సంస్థకు చెందిన ఫ్లైట్ స్కూల్‌కు చెందిన ఓ ట్రైనర్ విమానం ప్రొపెల్లర్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూలైలో శిక్షణా విమాన విన్యాసం సందర్భంగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థి పైలట్లు మరణించారు. తాజా ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి చెందారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
The Consulate General of India, Vancouver, expresses its deepest condolences on the tragic demise of Shri Manoj Sivakumar and Shri Srisaran Thirugnanasambantham, two Indian students from Tamil Nadu and Puducherry, who lost their lives in a tragic air accident in Canada during…
— India in Vancouver (@cgivancouver) September 20, 2026