SUPERSTUD cordless car and home vacuum cleaner: ఇల్లు ఎంత శుభ్రం చేసినా సోఫాల సందుల్లో, డోర్ మ్యాట్ల కింద దుమ్ము పేరుకుపోతూనే ఉంటుంది. అలాగే కారు సీట్ల మధ్యలో ఉండే చెత్తను క్లీన్ చేయడం పెద్ద తలనొప్పి పని! ఈ చిన్న చిన్న సమస్యల కోసం భారీ ఖరీదైన వాక్యూమ్ క్లీనర్లు కొనలేమని టెన్షన్ పడుతున్నారా? మీ కోసమే మార్కెట్లోకి ఒక అద్భుతమైన మినీ గ్యాడ్జెట్ వచ్చేసింది. అదే ‘SUPERSTUD 2-in-1 పోర్టబుల్ కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్’! కేవలం.. రూ.1,420 ధరకే లభిస్తున్న ఈ మినీ క్లీనర్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం!
2-ఇన్-1 పోర్టబుల్ డిజైన్ :
ఈ వాక్యూమ్ క్లీనర్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని కార్డ్‌లెస్ డిజైన్. దీనికి ఎలాంటి.. వైర్లు లేదా ప్లగ్స్ అవసరం లేదు. దీనిని కేవలం.. ఛార్జ్ చేసుకొని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇల్లు, కారు రెండింటినీ క్లీన్ చేయడానికి ఇది పర్ఫెక్ట్‌గా సరి పోతుంది కాబట్టి.. దీనిని 2-ఇన్-1 గ్యాడ్జెట్ అంటారు. బరువు చాలా తక్కువగా ఉండటం వల్ల చేతితో పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి నొప్పి అనిపించదు.
పవర్‌ఫుల్ సక్షన్ పవర్ :
సైజులో చిన్నదిగా ఉన్నప్పటికీ, ఇది చాలా పవర్ ఫుల్ సక్షన్ పవర్‌ను కలిగి ఉంటుంది. కారు సీట్ల మధ్యలో ఉండే దుమ్ము వెంట్రుకలు, ఇళ్లలో సోఫాల కుషన్‌ల మధ్య ఉన్న చిన్నపాటి చెత్తను ఇది క్షణాల్లో పీల్చుకుంటుంది. కష్టమైన మూలలను క్లీన్ చేయడానికి ఇందులో ప్రత్యేకమైన నాజిల్ అటాచ్‌మెంట్‌లు కూడా లభిస్తాయి.
బ్యాటరీ , ఛార్జింగ్:
ఈ వాక్యూమ్ క్లీనర్‌లో రీఛార్జబుల్ బ్యాటరీని అమర్చారు. యూఎస్‌బీ కేబుల్ ద్వారా మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా ల్యాప్ టాప్‌తో దీనిని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఇల్లు లేదా కారును పూర్తిగా క్లీన్ చేయడానికి సరిపడా బ్యాటరీ బ్యాకప్ ఇది ఇస్తుంది.
సులభమైన మెయింటెనెన్స్ :
చెత్తను పీల్చుకున్న తర్వాత దానిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఇందులో ఉండే డస్ట్ కంటైనర్‌ను ఈజీగా విడదీసి, అందులో చేరిన చెత్తను బయట పడేయొచ్చు. దీని ఫిల్టర్‌ను శుభ్రం చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎంతో హైజెనిక్‌గా ఉండటంతో పాటు మెషిన్ లైఫ్‌ను కూడా పెంచుతుంది.
Also Read: ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?
వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్:
మార్కెట్లో ఉండే పెద్ద పెద్ద వాక్యూమ్ క్లీనర్లు వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనాల్సి వస్తుంది. కానీ.. కేవలం రూ.1,420 బడ్జెట్‌లో ఇల్లు, కారు రెండింటినీ శుభ్రం చేసుకునేలా ఈ సూపర్ స్టడ్ క్లీనర్ లభించడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపయోగం కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
మీ కారును, ఇళ్ళను ఎల్లప్పుడూ శుభ్రంగా, దుమ్ములేకుండా ఉంచుకోవడానికి ‘SUPERSTUD 2-in-1 పోర్టబుల్ కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్’ చాలా బాగా ఉపయోగపడుతుంది. పాకెట్ ఫ్రెండ్లీ ధరలో లభిస్తున్న ఈ మినీ గ్యాడ్జెట్‌ను ఇప్పుడే తెచ్చుకుని మీ శుభ్రతను మరింత ఈజీగా చేసుకోండి!