2026 TVS Ronin vs Royal Enfield Hunter 350: భారత్ లో 350 సీసీకి దగ్గరగా ఉండే బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణంతో పాటు స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ సెగ్మెంట్ నచ్చుతుంది. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండగా.. తాజాగా 2026 TVS రోనిన్ కూడా కొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చింది. దీంతో ఈ రెండు బైక్‌ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.
2026 TVS రోనిన్ ధర రూ.1.42 లక్షల నుంచి రూ.1.64 లక్షల వరకు ఉంది. మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర రూ.1.38 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు ఉంది. అంటే, ప్రారంభ వేరియంట్ విషయంలో హంటర్ 350 కొంత తక్కువ ధరతో అందుబాటులో ఉంది. అయితే, టాప్ వేరియంట్‌కు వెళ్లినప్పుడు హంటర్ ధర రోనిన్ కంటే సుమారు రూ.7 వేల వరకు ఎక్కువగా ఉంటుంది.
బైక్ కొనుగోలు సమయంలో చాలామంది లుక్, కలర్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తారు. 2026 రోనిన్‌ను మొత్తం ఆరు రంగుల్లో తీసుకువచ్చారు. సన్ లిట్ ఎల్లో, డెసర్ట్ మిరాజ్, గ్లేసియర్ సిల్వర్, చార్ కోల్ ఎంబర్, నింబస్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ ఇందులో ఉన్నాయి. హంటర్ 350 మాత్రం ఏకంగా పది కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఫ్యాక్టరీ బ్లాక్, రియో వైట్, రెబెల్ బ్లూ, లండన్ రెడ్, టోక్యో బ్లాక్ లాంటి షేడ్స్ ఉన్నాయి. రంగుల విషయంలో ఎక్కువ ఎంపికలు కావాలనుకునే వారికి హంటర్ లో మరిన్ని ఆప్షన్లు ఉన్నాయి.
2026 రోనిన్‌లో ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, ప్రీమియం సీటు, డ్యూయల్ ఛానల్ ABS, కనెక్టెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, ముందు వెనుక డిస్క్ బ్రేకులు, LED లైటింగ్ కూడా లభిస్తాయి. హంటర్ 350లో అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ క్లస్టర్, స్టిచ్డ్ సీటు, స్పోర్టీ గ్రాబ్ రైల్, సింగిల్ ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ విషయంలో రోనిన్ లో కొన్ని అదనపు టెక్నాలజీ ఫీచర్లు కనిపిస్తాయి.
పనితీరు విషయానికి వస్తే రెండు బైక్‌ల ఇంజిన్లలో స్పష్టమైన తేడా ఉంది. హంటర్ 350లో 349cc సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ దీనికి జత చేశారు. రోనిన్‌లో 225.9cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 20 bhp పవర్, 19.9 Nm టార్క్ ను అందిస్తుంది. దీనికి కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. పవర్ విషయంలో రెండు బైక్‌లు దాదాపు దగ్గరగా ఉన్నా.. టార్క్ లో మాత్రం హంటర్ 350 స్పష్టంగా ముందుంది.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 3 బిగ్ బైక్స్.. 750 సీసీ పవర్‌తో రచ్చ రచ్చే!