Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 లో అప్పుడే 2 వారాలు గడిచిపోయాయి. మొదటివారం చైత్ర (Chaitra) ఎలిమినేట్ కాగా,రెండవ వారం కృష్ణుడు (Krishnudu) ఎలిమినేట్ అయ్యి అభిమానులను నిరాశపరిచారు. ఇక మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగానే సాగింది. సుధీర్ , సృష్టిల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది ముఖ్యంగా ఒకరిపై ఒకరు చెత్త పోసుకొని మరి నామినేట్ చేసుకున్నారు. మొత్తం 16 మంది హౌస్ లోకి అడుగుపెడితే.. అందులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఝాన్సీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఈ వారం ఎలిమినేషన్ నుండి ఆమె తప్పించుకుంది. ఇక మిగిలిన 13 మంది మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా హీటెక్కించింది.
ఇకపోతే 13 మంది కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగానే జరిగింది.మరి ఈ మూడవ వారంలో నామినేషన్ లోకి వచ్చింది ఎవరు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత రెండు వారాల ఆటను గనుక పరిశీలిస్తే.. షాలిని, ఝాన్సీ, సృష్టి , దేబ్జానీ , వర్షిణి వీళ్లంతా ఎవరికి వారు తమ స్థాయిలో ఆట మొదలుపెట్టారు. చరణ్ , అమన్ ఇప్పుడిప్పుడే తమ ఆటను మెరుగుపరుచుకుంటున్నారు. ఇక వంశీ , ముఖేష్, రోహిత్, త్రిగుణ్ ఇంట్లో టాప్ అలాగే స్ట్రాంగ్ ప్లేయర్స్ గా నిరూపించుకున్నారు. ఇక మిగిలింది రాంప్రసాద్ , నరేష్, సుధీర్.. సుధీర్ ఎప్పటిలాగే తన మార్క్ క్రియేట్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. ఇక జబర్దస్త్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన రాంప్రసాద్, నరేష్ అయితే ఇప్పట్లో హౌస్ నుంచి వెళ్ళిపోరనే విషయమైతే అర్థమవుతోంది.
మరి ఈ మిగిలిన 13 మందిలో ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన వారెవరు అనే విషయానికొస్తే.. రోహిత్, సుధీర్ , వంశీ, సృష్టి , షాలిని, వర్షిణి , ముఖేష్ , త్రిగుణ్ ఇలా మొత్తం 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. పైగా ఇందులో ముఖేష్ , రోహిత్ , త్రిగుణ్ స్ట్రాంగ్ అలాగే టాప్ ప్లేయర్లు కాబట్టి ఎప్పటిలాగే వీళ్ళు టాప్ ప్లేస్ లోనే నిలుస్తారు. ఇక వంశీ , షాలిని ఆ నెక్స్ట్ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ఇక్కడ డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం సుధీర్, వర్షిని , సృష్టి అనే చెప్పాలి. వర్షిని విషయానికి వస్తే ఎలాగో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్స్ వేసి ఆడియన్స్ ఈమెను సేవ్ చేస్తారు.
ALSO READ: 8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!
సుధీర్ విషయం కాస్త పక్కన పెడితే సృష్టి గత వారమే ఎలిమినేట్ కావాల్సి ఉంది కానీ లాస్ట్ మినిట్ లో కృష్ణుడు వల్ల ఆమె సేవ్ అయ్యి కృష్ణుడు బయటకు వెళ్ళిపోయారు. ఇక ఈ వారం కూడా ఈమె గత వారాల లాగే ఆటలేమి ఆడకుండా ఎక్కడా కనిపించకుండా ఉంటే మాత్రం హౌస్ నుంచి గుడ్ బై చెప్పే పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది.. అయితే తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సృష్టి సుధీర్ మధ్య ఫైట్ గట్టిగానే జరిగింది. ఇదే ఫైర్ వీక్ మొత్తం కొనసాగించిందంటే మాత్రం సేఫ్ అవుతుంది లేదంటే ఆమె ఎలిమినేట్ కాక తప్పదు. మరి చూద్దాం సృష్టి ఎలిమినేట్ అవుతుందా లేక సుధీర్ ఈ వారం బలవుతాడా అన్నది.