E-Paper
Advertisement

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!
Advertisement

Lenovo Chromebook 11IJL9: ప్రస్తుత డిజిటల్ రంగంలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పించడానికి, హోమ్‌వర్క్స్ చేసుకోవడానికి హెవీ-డ్యూటీ ల్యాప్‌టాప్‌లు అవసరం లేదు. బడ్జెట్ ధరలో.. రోజూవారీ అవసరాలను తీర్చే ల్యాప్‌టాప్ ఉంటే సరి పోతుంది. అలాంటి అవసరాల కోసం.. లెనోవో సంస్థ మార్కెట్లోకి తెచ్చిన అద్భుతమైన ప్రొడక్ట్ ఈ లెనోవో క్రోమ్‌బుక్ 11IJL9. స్టైలిష్ ‘మకా బ్లూ’ కలర్‌లో వస్తున్న ఈ ల్యాప్ టాప్ స్కూల్ పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు పర్ఫెక్ట్ ఛాయిస్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, పోర్టబిలిటీ :

ఈ క్రోమ్‌బుక్ ప్లస్ పాయింట్ దీని బరువు. కేవలం 1.21 కేజీల బరువు మాత్రమే ఉండే ఈ ల్యాప్‌టాప్ చాలా సన్నగా , కాంపాక్ట్‌గా ఉంటుంది. పిల్లలు తమ స్కూల్ బ్యాగ్‌లో దీనిని ఎంతో సులభంగా సర్దుకుని బడికి లేదా ట్యూషన్స్‌కు తీసుకెళ్లవచ్చు. 11.6 ఇంచుల డిస్‌ప్లే సైజ్.. చిన్నపిల్లల చేతులకు, వాళ్లకు పనిచేయడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ప్రాసెసర్, పర్ఫార్మెన్స్:

Advertisement

ఇందులో ‘Intel Celeron Dual Core N4500’ ప్రాసెసర్‌ను అందించారు. ఇది విద్యార్థులు చేసే సాధారణ ఆన్‌లైన్ క్లాసులు, గూగుల్ డాక్యుమెంట్స్ టైపింగ్, యూట్యూబ్ వీడియోస్ చూడటం, వెబ్ బ్రౌజింగ్ వంటి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా రన్ చేస్తుంది. డైలీ స్టడీస్ అవసరాలకు ఈ ప్రాసెసర్ సరిగ్గా సరి పోతుంది.

మెమరీ, స్టోరేజ్ :

ఈ ల్యాప్ టాప్‌లో 4 GB RAM , 64 GB eMMC స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. క్లౌడ్ బేస్డ్ వర్క్స్ చేసుకునే వారికి 64జీబీ స్టోరేజ్ సరి పోతుంది. ఒక వేళ మరింత డేటా అవసరమైతే గూగుల్ డ్రైవ్ లేదా మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

గూగుల్ క్రోమ్ ఓఎస్ మ్యాజిక్:

ఈ ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కాకుండా గూగుల్ వారి ‘Chrome OS’ పై పని చేస్తుంది. ఇది చాలా వేగంగా బూట్ అవుతుంది. సెకన్లలో ఆన్ అవుతుంది. వైరస్‌ల బెడద చాలా తక్కువగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ ఉండటం వల్ల ఆండ్రాయిడ్ యాప్స్‌ని కూడా ఇందులో డౌన్‌ లోడ్ చేసుకొని వాడొచ్చు.

బ్యాటరీ బ్యాకప్, కనెక్టివిటీ:

స్కూల్ పిల్లలకు లేదా బయట తిరిగే ప్రొఫెషనల్స్‌కు మంచి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ లెనోవో క్రోమ్‌ బుక్ ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేస్తుంది. అలాగే అవసరమైన యూఎస్‌బీ పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఇందులో అందుబాటులో ఉన్నాయి.

మొత్తంగా చెప్పాలంటే.. రూ.17 వేల లోపు బడ్జెట్‌లో పిల్లల చదువుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఈ  మోడల్’ అద్భుతమైనఆప్షన్. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపయోగం ఉండే.. ఈ క్రోమ్‌బుక్‌తో మీ పిల్లల డిజిటల్ లెర్నింగ్‌ను ఈజీ చేయండి!

Related News

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

Big Stories

Advertisement
×