Generic vs Branded Medicines: జనరిక్ మందుల ఎంట్రీతో.. ఔషదరంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. జనరిక్ మందుల షాపుల పుణ్యమాని.. ఎంతో ఖరీదైన మందులు సైతం చాలా చౌకగా సామాన్యులకు లభిస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ ప్రధాన ప్రశ్న చాలా మందిని వెంటాడుతోంది. బ్రాండెడ్ కంపెనీల ఔషధాలను కాదని జనరిక్ మందులను వాడొచ్చా? లేదా?. అసలు జనరిక్ మందులకు బ్రాండెండ్ ఔషధాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ధరల విషయంలో రెండింటి మధ్య అంత తేడా ఎందుకు ఉంటోంది? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒక బ్రాండెడ్ ఔషధానికి, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చే జనరిక్ వెర్షన్‌కు మధ్య ఉండే ప్రధానమైన కెమికల్ కాంపౌండ్ ఒకే పరిమాణంలో ఉండటం తప్పనిసరి. దేశంలో ‘డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్’ ప్రకారం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అమలు చేస్తున్న చట్టబద్ధమైన నిబంధన ఇది. ఉదాహరణకు, మెడికల్ షాపులో ‘మెట్‌ఫార్మిన్ 500mg’ బ్రాండెడ్ మాత్ర.. జనరిక్ తయారు చేసిన టాబ్లెట్ కు మధ్య మెడిసన్ ఫార్మూలా 100 శాతం ఒక్కటై ఉండాలి.
అయితే బ్రాడెండ్, జనరిక్ ఔషధం తయారీలో మూలపదార్థం ఒకటే అయినప్పటికీ దాని చుట్టూ ఉండే ఇన్‌యాక్టివ్ పదార్థాల్లో తేడాలు ఉండొచ్చు. టాబ్లెట్ పైన వేసే కోటింగ్స్, రంగులు, నిల్వ ఉండేలా చేసే ప్రిజర్వేటివ్‌లు.. బ్రాండ్‌ను బట్టి మారే అవకాశముంది. అంతేకాకుండా మాత్ర కడుపులో ఎంత వేగంగా కరుగుతుంది? మింగడానికి ఎంత సులభంగా ఉంది? పొట్టలో ఏమైనా అసౌకర్యం కలిగిస్తుందా? అనేది ఈ ఇతర పదార్థాలపైనే ఆధారపడి ఉంటుంది. చాలా మంది రోగుల్లో ఈ తేడాలు మందు పనిచేసే తీరుతో పాటు వ్యక్తి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే కొందరిలో మాత్రం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కంపెనీ మందులత తహాలోనే జనరిక్ మందులు సైతం శరీరానికి సరిగ్గా అందుతుందా? లేదా? చెక్ చేయడానికి ‘బయోఈక్వివలెన్స్’ పరీక్షలను నిర్వహిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), సీడీఎస్‌సీఓ నిబంధనల ప్రకారం.. జనరిక్ డ్రగ్ శోషణ పరిమితి 80 నుండి 125 శాతానికి మధ్య ఉండాలి. మానవ శరీరంలో ఔషధాల శోషణ సామర్థ్యం రోజురోజుకు సహజంగానే కొంత మారుతుంటుంది కాబట్టి అత్యధిక రకాల మందులకు ఈ పరిమితి సురక్షితమైనదిగానే నిపుణులు భావిస్తారు.
ఇదిలా ఉంటే ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP) ద్వారా దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కేంద్రాలలో 50 నుండి 90 శాతం తక్కువ ధరలకే జనరిక్ మందులు లభిస్తున్నాయి. ఇక్కడ లభించే మందులు సీడీఎస్‌సీఓ నాణ్యతా ప్రమాణాలను పాస్ అయిన కంపెనీల నుంచే వస్తుండటం విశేషం. సాధారణ దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ మందుల వాడకంలో బ్రాండెడ్ తో పోలిస్తే జన ఔషధి మందుల పనితీరులో ఎలాంటి వ్యత్యాసం లేదని ఇప్పటికే అధ్యయనాలు నిరూపించాయి. అయితే జనరిక్ మందుల ధరలు తక్కువగా ఉండటానికి కారణం ప్రకటనల ఖర్చులు, బ్రాండ్ రాయల్టీలు, ఆర్ అండ్ డీ (R&D) ఖర్చులు లేకపోవడమే తప్ప నాణ్యత తగ్గడం వల్ల కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అప్పటివరకూ బ్రాండెండ్ మందులు వాడి.. ఒక్కసారిగా జనరిక్ కు మారాలని భావిస్తున్నవారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదిస్తే బెటరని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫిట్స్, గుండె సమస్యలకు సంబంధించి జనరిక్ మందులకు డాక్టర్ ను సలహా తీసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. అలాగే బీపీ, షుగర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జనరిక్ కు తాగినట్లు పవర్ ఫుల్ మెడిసన్ ను డాక్టర్ సజిషన్ తో తీసుకోవడం బెటరని పేర్కొంటున్నారు.
Also Read: సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!
ఇక దేశంలో విక్రయించే ప్రతి టాబ్లెట్ స్ట్రిప్‌పై జనరిక్ పేరు, తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ స్పష్టంగా ఉండాలని నియమం ఉంది. మెడికల్ షాప్ వారు ప్రత్యామ్నాయం ఇచ్చినప్పుడు మందు పేరు, మోతాదు (500mg, 1000mg) ఒకటేనా కాదా చెక్ చేసుకోవాలి. తయారీ ఫార్మూలా ఒకటే అయినంతవరకూ బ్రాండ్ పేరు మారినా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెడిసన్ అనేది బ్రాండ్ పేరు మీద కాకుండా తయారీ ప్లాంట్ పాటించే సీడీఎస్‌సీఓ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
Also Read: మాత్రలపై ఆ చిన్న గీత ఎందుకుందో తెలుసా? డిజైన్ కాదు… అసలు రహస్యం ఇదీ!