Big tv Kissik Talks: బుల్లితెర నటిగా, యాంకర్ గా ఎన్నో సీరియల్స్, ఇతర కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హరితేజ (Hariteja)ఒకరు. ఇటీవల కాలంలో హరితేజ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హరితేజ సరదాగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తన కూతురు గురించి కూడా హరితేజ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. తన కూతురు పుట్టిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని తెలిపారు.
అప్పటివరకు నా ప్రపంచంలో నేను ఉండేదాన్ని కానీ కూతురు పుట్టిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నానని, బాధ్యతలు తెలిసి వచ్చాయని తెలిపారు . తన కూతురి కోసం నన్ను నేను మార్చుకున్నానని వెల్లడించారు. అలాగే ఈమె ప్రెగ్నెన్సీ సమయం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో కరోనా వచ్చిందని, ఆ క్షణం తాను ఈ గండం నుంచి నన్ను బయటపడేయి దేవుడా అంటూ మాత్రమే దేవుని ప్రార్థించేదాన్ని తెలిపారు. తన కుమార్తె పొట్టలో ఉండగానే తనకు కూడా కరోనా వచ్చిందని ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని హరితేజ తెలిపారు.
ఇక కరోనాతో ఉన్న సమయంలోనే పాప కూడా జన్మించిందని నాకు కోవిడ్ రావడంతో మా ఇంట్లో వారందరికీ కూడా కోవిడ్ అటాక్ అయిందని తెలియజేశారు. పాపను తాకాలంటే కూడా నాకు భయం వేసేదనీ, తనకు పాలు పట్టడానికి కూడా గ్లౌజులు మాస్క్ వేసుకొని చాలా ఇబ్బంది పడ్డాను అంటూ అప్పటి సంఘటనలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నా పాప కూడా కోవిడ్ బేబీ అంటూ ప్రెగ్నెన్సీ సమయంలో ఈమె ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు. అదేవిధంగా తన పెళ్లి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మా పెళ్లి వెనుక పెద్ద కథ నడిచిందని తెలిపారు . ముందుగా మా ఇద్దరి ఫోటోలు పెద్దలు ఒకరికొకరు మార్చుకున్నారు. ఆయనకు నేను నచ్చాను కానీ తనకు మాత్రం ఆయన నచ్చలేదని హరితేజ తెలిపారు. ఇలా నేను రిజెక్ట్ చేసినప్పటికీ ఆయన మాత్రం నన్ను కలిసి నాతో రెండు సంవత్సరాల పాటు ట్రావెల్ చేశారని అప్పుడు ఆయన ఏంటో అర్థం అయ్యి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇక మా ఇంట్లో వాళ్ళు ఈ సంబంధం క్యాన్సిల్ అయిందని వేరే సంబంధాలు చూస్తున్న సమయంలో మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి షాక్ ఇచ్చామంటూ హరితేజ తెలిపారు. ఇలా మా పెళ్లి పెద్దలు కుదిరిచిందే కానీ మేం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇక ఇద్దరి మధ్య గొడవలు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు గొడవలు అనేది సర్వసాధారణమని అయితే గొడవ పడిన ఒకసారి నేనే ముందుగా సారీ చెబుతానని హరితేజ తెలిపారు.
Also Read: Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!