OTT Movie : ఆడియన్స్ చేత అదుర్స్ అనిపించేలా తమిళ ‘బైసన్’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దీని డిజిటల్ హక్కులు కూడా పొందింది. ఈ కథ ఒక గ్రామంలో జరిగే కబడ్డీ ఆట చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో కుల గొడవలు ఎక్కువగానే ఉంటాయి. దీని వల్ల హీరో కుటుంబం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అయితే హీరో ఈ కబడ్డీ ఆటతో గ్రామాన్ని ఏకం చేయాలనుకుంటాడు. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘బైసన్’ (Bison) 2025లో వచ్చిన తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా. మారి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ధ్రువ్ విక్రమ్, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ 2025 అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా వచ్చే నెల మొదటి వారంలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కి రానుంది. IMDbలో దీనికి 8.1/10 రేటింగ్ కూడా ఉంది.
రాయలసీమలోని చిన్న గ్రామంలో బిసన్ అనే యువకుడు ఒక కబడ్డీ ప్లేయర్. అతను తన గ్రామం కోసం ఈ ఆటను ఆడతాడు. బిసన్ గతంలో చాలా కష్టాలు పడ్డ వ్యక్తి. అతని కుటుంబం, గ్రామంలో కుల గొడవల్లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు హీరోయిన్ అతని జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. వాళ్ల మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. బిసన్ కబడ్డీ ద్వారా తన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కుల గొడవలు ఆపాలని కలలు కంటాడు. బిసన్ కబడ్డీ టీమ్‌లో ఆడుతూ, తన గ్రామాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ గ్రామంలో శత్రువులు అతన్ని ఇబ్బంది పెడతారు.
Read Also : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా
ఈ సమయంలో హీరోయిన్ అతనికి సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తుంది. బిసన్ కబడ్డీ ద్వారా తన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కుల గొడవలు ఆపాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఈ కథలో కబడ్డీ మ్యాచ్‌లో గొడవలు, ఎమోషన్స్ మొదలవుతాయి. క్లైమాక్స్ లో బిసన్ తన టీమ్‌తో పెద్ద కబడ్డీ టోర్నమెంట్‌లో ఆడుతాడు. ఊరు మొత్తం ఈ ఆట గెలవాలని కోరుకుంటుంది. బిసన్ ఈ ఆటలో గెలుస్తాడా ? తన గ్రామాన్ని ఏకం చేస్తాడా ? కుల గొడవల సమస్య కొలిక్కి వస్తుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.