BigTV English

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!
Advertisement

OG OTT: సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం “ఓజి”(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సినిమాని అందుకొని చాలా కాలం అయింది. ఇలాంటి తరుణంలోనే ఓజి అంటూ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.


తుఫాన్ తిరిగి వచ్చేస్తోంది..

ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) వారు భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేస్తూ ఒకానొక సమయంలో ముంబైలో తుఫాన్ ఉండేది.. ఇప్పుడు తిరిగి తుఫాన్ వచ్చేస్తోంది అంటూ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి వెల్లడించారు.

ఓటీటీలో అడుగు పెట్టబోతున్న ఓజీ…

ఇలా థియేటర్లలో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ సినిమా తిరిగి ఓటీటీలో రాబోతోందనే విషయం తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో బీభత్సమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. మరి వెండితెరపై అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)నటించారు.


ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ బిగ్ అప్డేట్ కూడా వెల్లడించారు ఓ.జి యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు రాబోతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ సినిమాల షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ హీరో నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఓజి సీక్వెల్ పనులలో సుజిత్ బిజీ కాబోతున్నారు.

Related News

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

OTT Movie : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×