OTT Movie : ఈ దీపావళి సీజన్‌లో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ పండుగ వీకెండ్‌ను, మిమ్మల్ని పక్కా ఎంటర్‌టైన్ చేస్తాయి. బాఘీ 4 (హిందీ యాక్షన్), కిష్కింధాపురి (తెలుగు హారర్ థ్రిల్లర్), మిరాజ్ (మలయాళం థ్రిల్లర్), అవర్ ఫాల్ట్ (స్పానిష్ రొమాన్స్) వంటి సినిమాలు, ఇప్పుడు యాక్షన్ నుండి రొమాన్స్ వరకు ఓటీటీని షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలతో దీపావళి పండుగను మరింత ఆనందంగా చేసుకోండి. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయి ? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హిందీ యాక్షన్ సినిమాలో టైగర్ ష్రోఫ్, సంజయ్ దత్త్, హర్నాజ్ కౌర్ సంధు, సోనామ్ బాజ్వా, శ్రేయస్ తలపాడే లీడ్ రోల్స్ పోషించారు. థియేటర్లలో 2025 సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ రానీ (టైగర్ ష్రోఫ్) ఒక ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత కోమా నుండి మేల్కొంటాడు. ఆ సమయంలో అతనికి తన పాస్ట్ గుర్తుకు వస్తుంది. తన లవర్ అలిషాతో పాటు కొన్ని మర్డర్స్ జరుగుతాయి. వీటికి రానీ రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. రానీ హాల్యూసినేషన్స్ ఫేస్ చేస్తూ, తన ఎనిమీస్‌ను కనుగొంటాడు. చివర్లో హై-ఆక్టేన్ ఫైట్‌లో రానీ తన శత్రువులను ఓడించి, ప్రతీకారం తీర్చుకుంటాడు. యాక్షన్ ఫ్యాన్స్‌కు ఇదొక ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రాల్లో నటించిన ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 17 నుంచి ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ రాఘవ (సాయి శ్రీనివాస్) మైథిలి (అనుపమ) అనే లవర్స్, కిష్కింధా పురి గ్రామంలో “ఘోస్ట్ వాకింగ్ టూర్” కంపెనీ నడుపుతారు. అంటే టూరిస్టులను హాంటెడ్ ప్లేసెస్‌కు తీసుకెళ్లి, భయంకరమైన కథలు చెప్పడం అన్నమాట. వాళ్ల లేటెస్ట్ టూర్ లో ఒక పాత రేడియో స్టేషన్‌కు తీసుకెళ్తారు. అక్కడ భూతాలు ఉన్నాయని, చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక రేడియో జాకీ, స్టేషన్ ఓనర్ ట్రాజిక్‌గా చనిపోయారని తెలుసుకుంటారు. అయితే అక్కడ ఈ సారి ఒక భూతం వాళ్ళని హంట్ చేస్తుంది. దీని నుంచి తప్పించుకునే క్రమంలో ఈ స్టోరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడుస్తుంది.
అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ మలయాళం థ్రిల్లర్ సినిమా 2025సెప్టెంబర్ 19న థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 20 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ కథ అభిరామి (అపర్ణ బాలమురళి) ఫయాన్సీ కిరన్ ఒక ట్రైన్ యాక్సిడెంట్‌లో మిస్సింగ్ అవుతాడు. ఆమె నిజం తెలుసుకోవడానికి అస్విన్ (అసిఫ్ అలీ), ఒక జర్నలిస్ట్‌తో టీమ్ అప్ అవుతుంది. వాళ్లు ఇన్వెస్టిగేషన్‌లో ఒక ఫైనాన్షియల్ స్కామ్ గురించి తెలుసుకుంటారు. కిరన్ ఒక క్రిమినల్ గ్యాంగ్‌తో కనెక్ట్ అయ్యాడని రివీల్ అవుతుంది. చివరి ట్విస్ట్ లో కిరన్ బతికే ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అభిరామి జీవితం ప్రమాదంలో పడుతుంది. ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లర్, ఎమోషనల్ మూమెంట్స్ తో నడుస్తుంది.
ఈ స్పానిష్ రొమాంటిక్ సినిమాకి డొమింగో గాంజాలెజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో నికోల్ వాలెస్, గాబ్రియల్ గువారా, గాబ్రియలా అండ్రాడా నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 అక్టోబర్ 16 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ నోహ్, నిక్ తమ ఫ్రెండ్స్ జెన్నా, లయోన్ వెడ్డింగ్‌లో మీట్ అవుతారు. వాళ్ల బ్రేకప్ తర్వాత గిల్టీతో బాధపడుతుంటారు. కానీ పాత లవ్ ఫీలింగ్స్ మళ్ళీ తిరిగి వస్తాయి. నోహ్ ఒక బుక్ రాస్తూ, తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. చివర్లో నిక్, నోహ్ కలిసి తమ లవ్‌ను రీకైండిల్ చేసి, వెడ్డింగ్ ప్లాన్ లో మునిగిపోతారు.
ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్,వెబ్ సిరీస్ కి సయాంతన్ ఘోసల్ డైరెక్షన్ లో వచ్చింది. రితుపర్ణా సెంగుప్త, రాహుల్ బోస్ ఇందులో లీడ్ రోల్స్ పోషించారు. ఇది 2025 అక్టోబర్ 17 నుండి బెంగాలీ, తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథలో అనురేఖా (రితుపర్ణా) ఒక ఫేమస్ కార్టూనిస్ట్, ఆమె కూతురు ఒక రిచ్యువల్ మర్డర్‌లో చనిపోతుంది. అనురేఖా షాక్‌లో ఉంటూ, ఈ మర్డర్ ఒక సీరియల్ కిల్లింగ్ చైన్‌లో భాగమని తెలుసుకుంటుంది. ఆమె సొంతంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కిల్లర్ కి ఒక పొలిటికల్ లీడర్ తో లింకు ఉంటుంది. అనురేఖా తన కార్టూన్స్‌ని క్లూస్‌గా ఉపయోగించి, తన కూతురు డెత్‌కు కిల్లర్ పై రివెంజ్ తీర్చుకుంటుంది.
Read Also : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్