Big Stories

Human Cells:- మనుషుల సెల్స్‌కు ఏజ్ తగ్గించే ప్రయోగం సక్సెస్..

Human Cells : మనుషుల ఆరోగ్యం బాగుండాలన్నా, అవయవాలు బాగా పనిచేయాలన్నా.. లోపల ఉండే సెల్స్‌తోనే సాధ్యమవుతుంది. అయితే ఈరోజుల్లో మనుషుల వయసుతో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి సెల్స్ ఏజింగ్ మాత్రం వేగంగా జరుగుతోంది. అలా జరగకుండా ఉండడం కోసం శాస్త్రవేత్తలు ఓ కొత్త మార్గాన్ని కనిపెట్టారు. తాజాగా పలువురు శాస్త్రవేత్తలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈ ప్రయోగం గురించి వారే స్వయంగా ప్రకటించారు.

- Advertisement -

శాస్త్రవేత్తలు సెల్స్‌ను గైడ్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సర్క్యూట్‌ను తయారు చేశారు. ఈ సర్క్యూట్ అనేది సెల్స్‌ను రెండు ట్రాక్స్‌లో నడిపిస్తుంది. దీని కారణంగా సెల్స్ అనేవి ఎప్పటికీ ఆ రెండు ట్రాక్స్‌లోనే మెల్లగా ప్రయాణిస్తూ ఉంటాయి. వాటికి వేగంగా వెళ్లే అవకాశం కూడా రాదు కాబట్టి సెల్స్ ఏజింగ్ అనేది వేగంగా జరగకుండా ఉంటుంది. అసలు ఇలా జరిగే వీలు ఉంటుందా అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. ఈ రీసెర్చ్ టీమ్ మాత్రం సెల్స్ ఏజింగ్‌ను తగ్గించి విమర్శించే వారికి గట్టి సమాధానమే ఇచ్చారు.

- Advertisement -

సెల్స్ పుట్టుకల గురించి, వాటి మరణాల గురించి ఏళ్ల తరబడి స్టడీ చేస్తున్న శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. జీన్ సర్క్యూట్ అనేది సెల్స్‌ను ఒక ట్రాక్ నుండి ఇంకొక ట్రాక్‌కు మారుస్తూ ఉంటుంది. బయోలజికల్ భాషలో చెప్పాలంటే సెల్స్ అనేవి డీఎన్ఏ ట్రాక్ నుండి మైటోక్రాండియల్ ట్రాక్‌కు మారుతాయి. ఈ సర్క్యూట్ వల్ల సెల్స్ ఏజింగ్ వేగం తగ్గడం మాత్రమే కాకుండా వాటి డ్యామేజ్ కూడా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ట్రాక్స్ మారుస్తూ ముందుకు వెళ్తున్న కూడా సెల్స్ ప్రయాణం ఆగదు కానీ వేగం తగ్గుతుందన్నారు.

సింథటిక్ బయోలజీ అనేది సెల్స్‌పై పరిశోధనల విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మెకానికల్ ఇంజనీర్ ఎలా అయితే కార్లు రిపేర్ చేస్తాడో.. సింథటిక్ బయోలజీ కూడా సెల్స్ విషయంలో అలాగే ప్రవర్తిస్తుందని అన్నారు. సెల్స్ ఏజింగ్ అనేది అదుపులోకి తీసుకురాగలిగితే.. ఆటోమేటిక్‌గా మనుషుల ఏజ్ కూడా ఉన్నదానికంటే చిన్నగానే అనిపిస్తుంది. అయితే శాస్త్రవేత్తలు తాజాగా చేసిన ఈ ప్రయోగం మనుషుల జీవితకాలాన్ని పెంచే విధంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పరిశోధనలు కేవలం ఈస్ట్ సెల్స్‌పైనే జరిగినా.. త్వరలోనే వీటిని మనుషులపై కూడా చేస్తామని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News